News November 18, 2024

ప.గో: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వికేంద్రీకరణ

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో అమలు చేయనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలన మరింత చేరువ చేయడానికి వికేంద్రీకరణ చేశామన్నారు. సోమవారం నుంచి ప్రజలు తమ ఫిర్యాదులను మండల, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లో ఇవ్వాలన్నారు. ఈ మార్పును గమనించి సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. 

Similar News

News November 25, 2025

నిబంధనలు మీరితే కఠిన చర్యలు: కలెక్టర్‌

image

మందుగుండు సామాగ్రి తయారీ, నిల్వల విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ నాగరాణి హెచ్చరించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో తయారీదారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. భద్రతా ప్రమాణాలను విధిగా పాటించాలన్నారు. అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా తయారీ లేదా నిల్వలు చేపడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

News November 25, 2025

ధాన్యం కొనుగోలుపై ఫిర్యాదులకు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

image

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే కంట్రోల్‌ రూమ్‌ను సంప్రదించాలని ప.గో జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ సూచించారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొనుగోలు, రవాణా, తూకంలో సమస్యలుంటే 81216 76653, 1800 425 1291 నంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు. కొనుగోళ్లకు రైతు సేవా కేంద్రాలను సిద్ధం చేశామని, రైతులు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

News November 25, 2025

కంటి ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు: కలెక్టర్‌

image

పంచేంద్రియాల్లో నయనాలు ప్రధానమైనవని, ఉద్యోగులు కంటి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ నాగరాణి సూచించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. చూపు విషయంలో అశ్రద్ధ తగదని, వైద్యుల సలహాలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ఆమె పేర్కొన్నారు.