News August 19, 2024

ప.గో.: ప్రశ్నాపత్రంగా పెళ్లి శుభలేఖ

image

పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందిన ఓ టీచర్ తన పెళ్లి శుభలేఖను వినూత్నంగా ప్రింట్ చేయించారు. నార్కెడమిల్లి సతీష్, రాణి దంపతుల కుమార్తె ప్రత్యూషకు ఈ నెల 23న పెళ్లి జరగనుంది. తన వివాహ పత్రిక వినూత్నంగా ఉండాలని భావించిన ప్రత్యూష శుభలేఖను ప్రశ్నాపత్రం రూపంలో 8 ప్రశ్నలుగా విభజించింది. సింగిల్ ఆన్సర్ క్వశ్చన్, మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్, ట్రూఫాల్స్ ఆన్సర్ క్వశ్చన్స్‌గా కార్డ్ రూపొందించారు.

Similar News

News September 8, 2024

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా భీమవరం MLA తనయుడు

image

భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తనయుడు పులపర్తి ప్రశాంత్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. ప్రశాంత్‌ని నియోజకవర్గంలో పలువురు అభినందించారు.

News September 8, 2024

ప.గో.: అశ్లీల నృత్యాలు.. 8 మంది అరెస్ట్

image

ఉండి మండలం పెదపులేరులో గత నెల 15న వారాల పండగను పురస్కరించుకొని కొంతమంది వ్యక్తులు స్థానిక శ్మశానవాటిక సమీపంలో అశ్లీల నృత్యాలు చేసినట్లు వీఆర్వో పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు ఉండి ఎస్ఐ మహమ్మద్ నజీరుల్లా తెలిపారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 8, 2024

మంత్రి రామానాయుడికి CM అభినందన

image

వరదల నేపథ్యంలో అధికారులు, మంత్రులతో సీఎం చంద్రబాబు శనివారం సమావేశమయ్యారు. కాగా బుడమేరు గండ్లు పూడిక పనుల్లో పాల్గొన్న ఇరిగేషన్ అధికారులకు, మంత్రి నిమ్మలను ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం గట్టు ఎంత ఎత్తు పెంచారని అడిగి తెలుసుకుని, బుడమేరు గట్టును పూర్తిస్థాయిలో ఎత్తు పెంచి, బలోపేతం చేయాలని సూచించారు. పులివాగు పొంగుతుండటంతో మరింత వరద వచ్చే అవకాశం ఉందని, మరో రెండు రోజులు అలర్టుగా ఉండాలన్నారు.