News March 25, 2025

ప.గో: ప్రాణాలు తీస్తున్న ఈత సరదా..!

image

గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు ఈత ఒక సరదా..! కానీ అదే ఈత పసిప్రాణాలను హరించేస్తోంది. ఏటా ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీని పర్యవసానంగా పలు కుటుంబాల్లో విషాదం అలముకుంటోంది. వేసవిలో ఒక పూట బడులు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు సరదాకు కాలువ గట్లు, చెరువులు, కుంటల్లో ఈతకు వెళ్తున్నారు.  అవి ఎక్కువ లోతు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల తమ పిల్లలపై ఒక కన్ను వేసి ఉంచాలి. 

Similar News

News April 19, 2025

భీమవరం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

కాకినాడ జిల్లా ప్రత్తిపాడుకు చెందిన అడ్డాల చిన్న (24) భీమవరం రూరల్ మండలంలో లోసరి హైవేపై వ్యాన్ ఢీకొనడంతో తలకు తీవ్రమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ వీర్రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు చిన్న హైదరాబాదులో జిమ్‌లో కోచ్‌గా పని చేస్తున్నాడని, బైక్‌పై హైదరాబాద్ నుంచి ప్రత్తిపాడు వెళుతుండగా లోసరిలో ఈ ప్రమాదం సంభవించింది అని తెలిపారు.

News April 19, 2025

ప.గో : మెగా DSCలో మొత్తం పోస్టులు ఇవే..!

image

మరో కొద్ది రోజుల్లో మెగా DSC నోటిఫికేషన్ విడుదల కానుందని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి ప.గో జిల్లాలో భర్తీ అయ్యే పోస్టులను ఆయా యాజమాన్యాలు ప్రకటించాయి. ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలో 725, మున్సిపల్ యాజమాన్య పాఠశాలకు సంబంధించి 310, ఎస్జీటీ కేడర్‌లో ఉన్న 260 పోస్టులపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News April 19, 2025

ప.గో: జేసీ హెచ్చరికలు 

image

షాపులు నిర్వాహకులు రోడ్ల పక్కన చెత్త వేస్తే చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం జేసీ భీమవరం పట్టణంలో పలు ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోడ్డు పక్కన వ్యాపారస్తులు వద్దకు వెళ్లి చెత్త ఎక్కడ వేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్ కవర్లను వాడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

error: Content is protected !!