News August 9, 2024

ప.గో: ప్రోటోకాల్.. జెండా ఎగురవేసే మంత్రులు వీరే

image

రాష్ట్ర, జిల్లా స్థాయిలో స్వాతంత్ర్య వేడుకల నిర్వహణపై ఏపీ సాధారణ పరిపాలన శాఖ ప్రొటోకాల్‌ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే స్వాతంత్ర్య దినోత్స వేడుకల్లో పాల్గొనున్న మంత్రుల వివరాలు వెల్లడించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఏలూరు జిల్లాలో కొలుసు పార్థసారథి ముఖ్య అతిథులుగా జెండా ఎగురవేస్తారని పేర్కొంది.

Similar News

News December 9, 2025

ప.గో జిల్లా ప్రజలారా.. ఈ నెంబర్లు సేవ్ చేసుకోండి

image

ఉమ్మడి ప.గో జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, అవినీతికి పాల్పడినట్లు తెలిసినా, ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. ఏసీబీ డీఎస్పీ 9440446157, సీఐలు 9440446158, 9440446159, టోల్ ఫ్రీ 1064కు ఫిర్యాదు చేయవచ్చాన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. (నేడు అంతర్జాతీయ అవినీతి నిరోధక దినం)

News December 9, 2025

ఈ కమిషనర్ మాకొద్దు: నరసాపురం కౌన్సిల్ ఫిర్యాదు

image

నరసాపురం మున్సిపల్ కమిషనర్ అంజయ్యను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని మునిసిపల్ చైర్‌పర్సన్ బర్రె శ్రీ వెంకట రమణతో పాటు వైసీపీ కౌన్సిల్ సభ్యులు జేసీ రాహుల్ కుమార్ రెడ్డికి PGRSలో ఫిర్యాదు చేశారు. అభివృద్ధి పనులకు కౌన్సిల్ తీర్మానం చేసినా పట్టించుకోవట్లేదని, అవినీతి ఆరోపణలు వంటి కారణాల వల్ల ఆయనను సరెండర్ చేయాలని కౌన్సిల్ తీర్మానించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తీర్మాన పత్రాన్ని జేసీకి అందించారు.

News December 9, 2025

ప.గో జిల్లా మొత్తం 8 పరీక్షా కేంద్రాలు

image

డిసెంబర్ 10 నుంచి 21 వరకు జరిగే టెట్(TET) పరీక్షల కోసం జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. భీమవరం 5, నరసాపురం 1, తాడేపల్లిగూడెంలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 12,985 మంది అభ్యర్థులు హాజరవుతారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.