News August 22, 2024
ప.గో: బదిలీలకు ప్రణాళికలు.. ఉద్యోగుల్లో గుబులు

ఈనెల 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులతో ఉమ్మడి ప.గో జిల్లాలో పలువురు ఉద్యోగుల గుండెల్లో గుబులు మొదలైంది. విద్య, వైద్య శాఖలు మినహా మొత్తం 15 శాఖల్లో బదిలీలకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో ఏళ్ల తరబడి ఒకే చోట పని చేస్తున్న వారిలో కొందరు ఇప్పటికే పైరవీల కోసం యత్నిస్తున్నారట. ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో ఎక్కువ బదిలీలు ఉండనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 18, 2025
తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిపై దృష్టి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ థింక్స్ ఆక్వా పాండ్స్” కార్యక్రమానికి మంగళవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆక్వా రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని సాధించే దిశగా ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో దిశానిర్దేశం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
News November 18, 2025
అన్నదాత సుఖీభవ, ధాన్యం సేకరణపై జేసీ సమీక్ష

అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల రెండో విడత నగదు జమ, ఖరీఫ్ ధాన్యం సేకరణపై జేసీ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం భీమవరంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించి, వారి సూచనల మేరకు నిర్వహించాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతులకు కలిపి రూ.7 వేలు జమ అవుతాయని తెలిపారు.
News November 18, 2025
జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలి: కలెక్టర్

జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని, దీనిపై అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో గంజాయిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు.


