News July 20, 2024
ప.గో.: బాలికపై అత్యాచారం.. పదేళ్ల జైలు
ప.గో. జిల్లాకు చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో కలిసి బతుకుదెరువు కోసం HYD వెళ్లింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తూ తన పిల్లలు బాలిక(11), బాలుడు(12)ని చదివిస్తోంది. 2018లో బాలికపై స్థానికుడు బ్రహ్మం(24) ఇంట్లోకి ప్రవేశించి బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. తాజాగా నిందితునికి పదేళ్ల జైలు, రూ.5లక్షలు ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది.
Similar News
News December 11, 2024
నెరవేర్చలేని హామీలు ఇచ్చారు: బొత్స సత్యనారాయణ
నెరవేర్చని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం తణుకులోని పద్మశ్రీ ఫంక్షన్ హాలులో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ఉభయగోదావరి జిల్లాల వైసీపీ ఇన్చార్జీలు, నాయకుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
News December 10, 2024
వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారు: కారుమూరి
తణుకు పద్మశ్రీ ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఉమ్మడి ప.గో.జిల్లా నియోజకవర్గ ఇన్చార్జీలు, ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ, ఉభయగోదావరి జిల్లాల కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేసే తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారని అన్నారు.
News December 10, 2024
భీమవరం: జాయింట్ కలెక్టర్ ఆగ్రహం
ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం భీమవరం మండలం జువ్వలపాలెం రోడ్డులోని ఓ పూల దుకాణం వద్దకు ఆయన వచ్చారు. పూలను ప్లాస్టిక్ కవర్స్‌లో ఇస్తుండటంతో దుకాణ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వాడకం నిషేధంలో ఉండగా ప్లాస్టిక్ కవర్లు ఎందుకు వాడుతున్నారని గట్టిగా నిలదీశారు.