News July 27, 2024

ప.గో.: బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం

image

ఉండి మండలానికి చెందిన ఓ బాలికపై ఇద్దరు యువకులు <<13715911>>అత్యాచారానికి<<>> పాల్పడిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆకివీడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు, అతని స్నేహితుడు ఉప్పుటేరు వంతెన సమీపంలో రేకులషెడ్డులోకి బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం శుక్రవారం పోలీసుల దృష్టికి వెళ్లగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
☛ ఏలూరులో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే.

Similar News

News November 23, 2025

రేపు యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేని వారు 1100 కాల్ సెంటర్‌ ద్వారా లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News November 23, 2025

భీమవరం: ఘనంగా సత్యసాయి శత జయంతి ఉత్సవాలు

image

భీమవరంలో సత్యసాయి మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని, బాబా చిత్రపటానికి నివాళులర్పించారు. మానవసేవే మాధవసేవగా బాబా అందించిన సేవలు చిరస్మరణీయమని వారు కొనియాడారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే ఐదు సూత్రాలను అందరూ పాటించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

News November 23, 2025

భీమవరం: 29న మెగా జాబ్ మేళా

image

భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఈ నెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ డ్రైవ్‌లో 28కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.