News April 12, 2025
ప.గో: బావ.. నా రిజల్ట్ చూడు రా..!

పశ్చిమగోదావరి జిల్లాలో 37,831 మంది ఇంటర్ పరీక్షలు రాశారు. ఫస్ట్ ఇయర్‌లో 19,708 మంది, సెకండియర్‌లో 18,123 మంది ఫలితాలు రానున్నాయి. గతంలో హాల్‌టికెట్లతో నెట్ సెంటర్లకు వెళ్లగా.. నేడు అందరూ ఫోన్లు చేతపట్టుకుని వేయిట్ చేస్తున్నారు. ‘బావ.. నీకు సిగ్నల్ బాగుంటే నా రిజల్ట్ కూడా చూడు’ అంటూ పట్టణాల్లో ఉండేవారికి పల్లెటూరి విద్యార్థులు మెసేజ్ చేస్తున్నారు.
☞ వే2న్యూస్ యాప్‌లో వేగంగా ఫలితాలు చూసుకోవచ్చు.
Similar News
News October 29, 2025
ప.గో. కలెక్టర్‌తో మాట్లాడిన సీఎం చంద్రబాబు

మొంథా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తతపై సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి ఫోన్ ద్వారా ప్రత్యేకంగా సమీక్షించారు. తుఫాన్ కంట్రోల్ రూములు, పునరావాస కేంద్రాలపై ముఖ్యమంత్రికు జిల్లా కలెక్టర్ వివరించారు. తుఫాన్ ప్రభవాన్ని ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలిస్తూ ఉండాలని సీఎం సూచించారు.
News October 29, 2025
4,155 మందికి పునరావాసం: కలెక్టర్

మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 37 పునరావాస కేంద్రాల్లో మంగళవారం మధ్యాహ్నం నాటికి 4,155 మంది బాధితులకు భోజన సౌకర్యం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 3,581 ఎకరాల వరి పొలాల్లో వర్షపు నీరు చేరిందని, జిల్లాలో తుఫాను కారణంగా 10 గ్రామాలు ముంపునకు గురి కాగలదని గుర్తించడం జరిగిందని ఆమె వెల్లడించారు.
News October 28, 2025