News January 9, 2025
ప.గో: బెంబేలెత్తిస్తోన్న బస్ ఛార్జీలు

సంక్రాంతికి సొంతూర్లకు వచ్చేందుకు ఉమ్మడి ప.గో జిల్లా ప్రజలు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ట్రైన్ టికెట్స్ రిజర్వేషన్లు అయిపోయాయి. బస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. HYD నుంచి భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఏలూరు పట్టణాలకు ప్రయివేట్ ట్రావెల్స్‌లో సుమారుగా రూ. 2,500 నుంచి 3 వేల వరకు ఉన్నాయని చెబుతున్నారు. సంక్రాంతి సమయంలో ఛార్జీలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. మీ కామెంట్
Similar News
News December 8, 2025
ఘోర అగ్నిప్రమాదంలో తాడేపల్లిగూడెం యువకుడి మృతి

అమెరికాలోని బర్మింగ్ హామ్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. అందులో తాడేపల్లిగూడేనికి చెందిన అన్వేష్ రెడ్డి ఒకరు. ఘటనలో తీవ్రగాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా వీరి కుటుంబం HYDలోని కూకట్ పల్లిలో నివాముంటోంది.
News December 8, 2025
ప.గో: బాలికలపై టీచర్ లైంగిక వేధింపులు..!

విద్యార్థినులను ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భీమవరం మండలం గొల్లవానితిప్ప ఉన్నత పాఠశాల బాలికలను మ్యాథ్స్ టీచర్ లైంగికంగా వేధించినట్లు తెలియడంతో తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై తాజాగా నిర్వహించిన PTMలో తల్లిదండ్రులు అధికారులకు వివరించారు. చట్టపరంగా ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
News December 7, 2025
HIV బాధితుల పట్ల వివక్ష చూపొద్దు: మంత్రి నిమ్మల

2030 నాటికి HIV రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తునట్లు మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో HIV బాధితులకు చేయూత కార్యక్రమంలో ఆదివారం మంత్రి పాల్గొన్నారు. HIV బాధితులకు పౌష్టికాహారం, నిత్యవసర సరుకుల బ్యాగులను మంత్రి పంపిణీ చేసారు. సమాజంలో HIV బాధితుల పట్ల మానవత్వం, ప్రేమానురాగాలతో మెలగాలని, వారి పట్ల వివక్ష చూపవద్దని కోరారు.


