News July 22, 2024

ప.గో.: బ్రెయిన్ స్ట్రోక్.. సంగీత దర్శకుడు మృతి

image

ప.గో. జిల్లా ఉండికి చెందిన సినీ సంగీత దర్శకుడు గడి సతీష్ బాబు (50) శనివారం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై మృతిచెందారు. కాగా ఈయన గతంలో భీమవరంలోని ఓ ఆర్కెస్ట్రా బృందంలో కీబోర్డు ప్లేయర్‌గా పనిచేశారు. 2001లో సంగీత దర్శకుడు మణిశంకర్ వద్ద శిష్యుడిగా చేరి బెంగుళూరులో స్థిరపడ్డారని ఆయన సోదరుడు నరేంద్ర తెలిపారు. 150కి పైగా చిత్రాలకు రీ- రికార్డింగ్ చేయడంతో పాటు 6 కన్నడ చిత్రాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.

Similar News

News November 18, 2025

భీమవరం: ‘సీబీ-సీఐడీ’ పేరుతో మోసం

image

భీమవరం పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి శర్మ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకొని రూ.78 లక్షలు పోగొట్టుకున్నారు. గత నెల 27న సీబీ-సీఐడీ అధికారులమంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, సిమ్ సమస్యను పరిష్కరించడానికి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు అడిగారని ఆయన తెలిపారు. వారి మాటలు నమ్మి వివరాలు చెప్పడంతో, తన ఖాతా నుంచి దఫదఫాలుగా రూ.78 లక్షలను మాయం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తణుకు: ‘తల్లిదండ్రులను చూడని పిల్లలు శిక్షార్హులు’

image

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి వారి పోషణ పట్టించుకోలేని పిల్లలు శిక్షార్హులు అవుతారని తణుకు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పోతర్లంక సాయిరాం అన్నారు. సోమవారం తణుకు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు ఆర్డీవో అధికారుల ద్వారా న్యాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.