News August 31, 2024
ప.గో: భారీ వర్షాలు.. రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లు

రాష్ట్రమంతటా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొన్ని రైళ్లను రూట్ మార్చినట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. వాటి వివరాల కోసం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని హెల్ప్ లైన్ నెంబర్లను రైల్వే శాఖ ప్రకటించింది. భీమవరం టౌన్- 78159 09402, ఏలూరు- 78519 09348, తాడేపల్లిగూడెం-08818-226162, నిడదవోలు-08813-223325 నంబర్లకు సంప్రదించాలని పేర్కొంది.
Similar News
News November 26, 2025
భీమవరంలో మెప్మా జాబ్ మేళా ప్రారంభం

మెప్మా సంస్థ ఆధ్వర్యంలో, నిపుణ సహకారంతో భీమవరం మున్సిపల్ కౌన్సిల్ హాలులో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేళాలో 16 కంపెనీలు పాల్గొన్నాయని, ఇలాంటి అవకాశాలు నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడతాయని వారు అన్నారు.
News November 26, 2025
రైతు ఆర్థిక బలోపేతానికి ‘రైతన్నా.. మీకోసం’: కలెక్టర్

రైతును ఆర్థికంగా బలోపేతం చేసే చర్యల్లో భాగంగా నిర్వహిస్తున్న ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. బుధవారం పాలకోడేరు మండలం కుముదవల్లిలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఆమె రైతుల సమక్షంలో నిర్వహించారు. రైతు సత్యనారాయణ రాజు మండువా పెంకుటిల్లు అరుగుపైనే ఈ కార్యక్రమం జరిగింది.
News November 26, 2025
భీమవరం: ఎస్సీ, ఎస్టీ యువతకు సివిల్స్ ఉచిత శిక్షణ

రాష్ట్రంలోని 340 మంది నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు నవంబరు 26లోపు https://apstudycircle.apcfss.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబరు 10 నుంచి 4 నెలలపాటు శిక్షణ ఉంటుందని, మహిళా అభ్యర్థులకు 33 శాతం సీట్లు కేటాయించామని ఆయన వివరించారు.


