News August 31, 2024
ప.గో: భారీ వర్షాలు.. రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లు
రాష్ట్రమంతటా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొన్ని రైళ్లను రూట్ మార్చినట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. వాటి వివరాల కోసం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని హెల్ప్ లైన్ నెంబర్లను రైల్వే శాఖ ప్రకటించింది. భీమవరం టౌన్- 78159 09402, ఏలూరు- 78519 09348, తాడేపల్లిగూడెం-08818-226162, నిడదవోలు-08813-223325 నంబర్లకు సంప్రదించాలని పేర్కొంది.
Similar News
News September 8, 2024
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా భీమవరం MLA తనయుడు
భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తనయుడు పులపర్తి ప్రశాంత్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. ప్రశాంత్‌ని నియోజకవర్గంలో పలువురు అభినందించారు.
News September 8, 2024
ప.గో.: అశ్లీల నృత్యాలు.. 8 మంది అరెస్ట్
ఉండి మండలం పెదపులేరులో గత నెల 15న వారాల పండగను పురస్కరించుకొని కొంతమంది వ్యక్తులు స్థానిక శ్మశానవాటిక సమీపంలో అశ్లీల నృత్యాలు చేసినట్లు వీఆర్వో పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు ఉండి ఎస్ఐ మహమ్మద్ నజీరుల్లా తెలిపారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News September 8, 2024
మంత్రి రామానాయుడికి CM అభినందన
వరదల నేపథ్యంలో అధికారులు, మంత్రులతో సీఎం చంద్రబాబు శనివారం సమావేశమయ్యారు. కాగా బుడమేరు గండ్లు పూడిక పనుల్లో పాల్గొన్న ఇరిగేషన్ అధికారులకు, మంత్రి నిమ్మలను ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం గట్టు ఎంత ఎత్తు పెంచారని అడిగి తెలుసుకుని, బుడమేరు గట్టును పూర్తిస్థాయిలో ఎత్తు పెంచి, బలోపేతం చేయాలని సూచించారు. పులివాగు పొంగుతుండటంతో మరింత వరద వచ్చే అవకాశం ఉందని, మరో రెండు రోజులు అలర్టుగా ఉండాలన్నారు.