News May 21, 2024
ప.గో: భార్యను స్వదేశానికి రప్పించాలని వినతి

ఉపాధి నిమిత్తం ఖతర్ వెళ్లిన తన భార్య అక్కడ అనారోగ్యంతో ఇబ్బంది పడుతోందని, ఆమెను స్వదేశానికి తీసుకువచ్చేలా చూడాలని ప.గో జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లికి చెందిన ఉర్ల నవీన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం తాడేపల్లిగూడెంలోని హెల్ప్‌డెస్క్ కార్యాలయంలో గట్టిం మాణిక్యాలరావుకు వినతిపత్రం అందజేశారు. యజమానులు భోజనం సైతం పెట్టడం లేదని నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News October 27, 2025
ప.గోలో ముంపు ప్రాంతాలివే!

మొంథా తుఫాను నేపథ్యంలో జిల్లాలో అత్యంత ముప్పు ప్రాంతాలుగా 12 గ్రామాలను అధికారులు ప్రకటించారు. నరసాపురం పరివాహక ప్రాంతాలైన పేరుపాలెం నార్త్ , పేరుపాలెం సౌత్, కేపీపాలెం నార్త్, కేపీ పాలెం సౌత్, పెదమైన వాని లంక, చినమైన వాని లంక, దర్భరేవు, వేములదీవిఈస్ట్, వేములదీవి వెస్ట్, తూర్పు తాళ్లు, రాజులంక, బియ్యపుతిప్ప గ్రామాలను ప్రకటించారు. ఇక్కడే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాటు చేస్తున్నారు.
News October 27, 2025
మొంథా తుఫాన్.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి: కలెక్టర్

మొంథా తుపాను సందర్భంగా ఎటువంటి సమస్యలు తలెత్తినా ఏలూరు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08816 299219 ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి సూచించారు. సోమవారం కలెక్టర్, ఎస్పీ కలిసి కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. వచ్చిన కాల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అందరూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
News October 27, 2025
పశ్చిమ గోదావరి జిల్లాలో 28 పునరావాస కేంద్రాలు

‘మొంథా’ తుఫాన్ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ముందస్తు చర్యలు చేపట్టామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలో మొత్తం 28 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. నరసాపురం డివిజన్‌లో 10, తాడేపల్లిగూడెం డివిజన్‌లో 8, భీమవరం డివిజన్‌లో 10 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తుఫాన్ తీవ్రత, భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.


