News September 7, 2024
ప.గో.: భార్య చేపలకూర వండలేదని భర్త సూసైడ్
భార్య చేపల కూర వండలేదని అలిగి ఉరేసుకున్న వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు మొగల్తూరు ఏఎస్సై సత్యనారాయణ తెలిపారు. వివరాలు.. మండలంలోని ముత్యాలపల్లి చెందిన మైల సుబ్బరాజు (38) గత నెల 22న తన భార్యను చేపలకూర వండమని చెప్పారు. ఆమె వండకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబీకులు కాకినాడ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
Similar News
News November 17, 2024
ప్రభుత్వ అరాచకాలపై సంక్రాంతి తర్వాత ప్రణాళిక: మాజీ మంత్రి కారుమూరి
రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో పాటు అరాచకాలపై వైసీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి తర్వాత ప్రత్యేక ప్రణాళిక చేయనున్నట్లు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం తణుకు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాల పేరుతో కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు.
News November 17, 2024
దేవరపల్లి: కార్తీకమాసంలో చికెన్ ధరలు ఇలా
ప.గో జిల్లాలోని పలు ప్రాంతాలలో చికెన్ పై శ్రావణమాసం ఎఫెక్ట్ పడుతోంది. అయితే జిల్లాలో పలుచోట్ల ధరలు తగ్గితే .. కొన్నిచోట్ల మాత్రం సాధారణంగానే ఉన్నాయి. కాగా దేవరపల్లి మండలంలోని దుద్దుకూరు గ్రామంలో చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. కేజీ ఫారం మాంసం రూ. 200గా ఉంది, బ్రాయిలర్ రూ. 220 ఉంది. అయితే కార్తీకమాసం కావడంతో వినియోగదారులు తక్కువగా ఉన్నారని వ్యాపారస్థులు చెబుతున్నారు.
News November 17, 2024
తాడేపల్లిగూడెంలో ఎయిర్ పోర్ట్
రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, అందులో పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం ఒకటి. ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం ఆ ప్రాంతంలో 1,123 ఎకరాలను గుర్తించింది. పారిశ్రామిక , వ్యాపార , పర్యాటకం ఇలా అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.