News September 6, 2024
ప.గో.: మంకీ ఫాక్స్ కాదు.. చర్మ వ్యాధి
మంకీ ఫాక్స్ అనుమానిత లక్షణాలతో ఈ నెల 2న తణుకు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన వ్యక్తికి అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి అతనికి మంకీ పాక్స్ లేదని నిర్ధారించారని అత్తిలి PHC వైద్యాధికారి నాగరాజు గురువారం తెలిపారు. అతను చర్మ సంబంధితమైన వ్యాధితో ఇబ్బందులు పడుతున్నాడని, అది అంటు వ్యాధి కూడా కాదని వివరించారు.
Similar News
News September 15, 2024
ఏలూరు జిల్లాలో విషాదం.. భార్యాభర్తల మృతి
ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం వెంకటాపురంలో ఆదివారం అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తలు మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది. స్థానికుల వివరాల ప్రకారం.. తణుకు మండలం పిట్లవరం గ్రామానికి చెందిన వారు ఏడేళ్లుగా వెంకటాపురంలో నివాసం ఉంటున్నారు. కాగా భార్యను పీక నులిమి, భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి జంగారెడ్డిగూడెం DSP రవిచంద్ర చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 15, 2024
పల్నాడులో యాక్సిడెంట్.. ఏలూరు జిల్లావాసులు మృతి
పల్నాడు జిల్లా యడ్లపాడు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏలూరు జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు మరణించారు. SI బాలకృష్ణ తెలిపిన వివరాలు.. నిడమర్రు మండలానికి చెందిన కృష్ణ (31), రవి కిషోర్ (25) కారులో గుంటూరు వెళ్లారు. యడ్లపాడు వద్ద టైరు పంక్చర్ కాగా టైరు మారుస్తున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరోవ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు నమోదైంది.
News September 15, 2024
ఉండ్రాజవరం: రూ.10 లక్షల కరెన్సీతో గణనాథుడికి అలంకరణ
గణేశ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులు వినూత్న రీతిలో విఘ్నేశ్వర స్వామిని అలంకరిస్తున్నారు. ఉండ్రాజవరం మండలం కె.సావరం గ్రామంలోని వరసిద్ధి కాలనీలో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయక స్వామికి రూ.10 లక్షల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరణ చేసి తమ భక్తిని చాటుకున్నారు. స్వామిని తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు.