News June 2, 2024
ప.గో.: మరొక్క రోజే.. ఉత్కంఠ

రాష్ట్రంలో పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు శనివారం వెల్లడించడంతో ఉమ్మడి ప.గో. జిల్లాలో గెలుపు అవకాశాలపై ఓ అంచనా ఏర్పడిందని చర్చ సాగుతోంది. మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు గాను చాణక్య స్ట్రాటజీస్, పోస్ట్ పోల్, కేకే తదితర సంస్థలు కూటమే ఎక్కువ స్థానాలు గెలుస్తుందని చెప్పాయి. తుది ఫలితాలకు నేడు, రేపు మాత్రమే మిగిలిఉండగా ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది.
– సర్వే ఫలితాలపై మీ కామెంట్..?
Similar News
News November 19, 2025
ఈనెల 19న జిల్లాలో రైతుల ఖాతాలో రూ.68.97 కోట్లు

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద ఈ నెల 19న జిల్లాలోని 1,03,761 మంది రైతుల ఖాతాలలో రెండో విడతగా రూ.68.97 కోట్లు జమ కానున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ. 2 వేలు, రాష్ట్రం వాటా రూ. 5 వేలు చొప్పున మొత్తం రూ.7 వేలు జమ కానున్నాయి. నిధుల జమ కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు.
News November 19, 2025
భీమవరం: వరల్డ్ టాయిలెట్ డే గోడ పత్రిక ఆవిష్కరణ

ఈనెల 19న వరల్డ్ టాయిలెట్ డే పురస్కరించుకొని మంగళవారం భీమవరం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో వరల్డ్ టాయిలెట్ డే గోడ పత్రికను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బహిరంగ మలమూత్ర విసర్జన చేయకపోవడం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన కారణంగా ప్రజలు, జంతువులు ఎన్నో వ్యాధులకు గురి అవుతున్నాయని తెలిపారు.
News November 18, 2025
తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిపై దృష్టి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ థింక్స్ ఆక్వా పాండ్స్” కార్యక్రమానికి మంగళవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆక్వా రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని సాధించే దిశగా ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో దిశానిర్దేశం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.


