News November 22, 2024

ప.గో: మళ్లీ వైసీపీలోకి చేరుతున్న నేతలు

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన నేతలు తిరిగి ఆ పార్టీలోకి చేరుతున్నారు. తాజాగా తాళ్లపూడి ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు గురువారం వైసీపీలోకి చేరారు. నిడదవోలు 28వ వార్డు కౌన్సెలర్ ఆకుల ముకుందరావు, 10వ వార్డు కౌన్సిలర్ అరుగోలను వెంకటేశ్వరరావు మళ్లీ పార్టీ అధినేత సమక్షంలో సొంత గూటికి చేరారు.

Similar News

News November 12, 2025

ఇరగవరం: గృహ హింస కేసులో భర్తకు ఏడాది జైలు శిక్ష

image

గృహ హింస, వరకట్న వేధింపుల కేసులో ఇరగవరం (M) రేలంగికి చెందిన బాదంపూడి శ్రీనివాస్‌కు సంవత్సర కాలంతో పాటు అదనంగా 3 నెలల జైలు శిక్ష ఖరారు చేస్తూ, రూ. 4500ల జరిమానా విధిస్తున్నట్లు కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. 2021 MARలో భార్య సునీత రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై అప్పటి SI సతీష్ కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ పూర్తి కాగా న్యాయమూర్తి పీవీ నాగ రంజిత్ కుమార్ తుది తీర్పును వెల్లడించారు.

News November 12, 2025

తాడేపల్లిగూడెం: గడ్డి మందు తాగి..చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

తాడేపల్లిగూడెం (M) ఎల్. అగ్రహారంలో నివసిస్తున్న ముప్పడి కార్తీక్ (37) గడ్డి మందు తాగి విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రూరల్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఉద్యోగం లేకపోవడంతో మద్యానికి బానిసై ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి ఇంటి ముందు దొరికిన గడ్డి మందు తాగినట్లు అతని భార్య సునీత రూరల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 12, 2025

ఒక్కొక్క టీమ్ రోజుకు 25 ఎకరాలు రీ సర్వే చేయాలి: జేసీ

image

జిల్లాలో ఉండి, వీరవాసరం, నరసాపురం, యలమంచిలి మండలాల్లో ఒక్కొక్క టీం రోజుకు 25 ఎకరాలు రీ సర్వే చేసేలా ఆర్డీవోలు మండల సర్వేలు తహసీల్దార్లు పర్యవేక్షించాలని జేసి రాహుల్ అన్నారు. మంగళవారం జేసి ఛాంబర్లో అధికారులతో జరిగిన సమీక్షలో మాట్లాడారు. రైతులకు నోటీసులిచ్చి డాక్యుమెంట్లు పరిశీలించే సర్వే పూర్తి చేయాలన్నారు. రీ సర్వే ఫేస్ 2లో జున్నూరు, మార్టేరు గ్రామాలు రికార్డును సమర్పించాలని ఆదేశించారు.