News November 22, 2024

ప.గో: మళ్లీ వైసీపీలోకి చేరుతున్న నేతలు

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన నేతలు తిరిగి ఆ పార్టీలోకి చేరుతున్నారు. తాజాగా తాళ్లపూడి ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు గురువారం వైసీపీలోకి చేరారు. నిడదవోలు 28వ వార్డు కౌన్సెలర్ ఆకుల ముకుందరావు, 10వ వార్డు కౌన్సిలర్ అరుగోలను వెంకటేశ్వరరావు మళ్లీ పార్టీ అధినేత సమక్షంలో సొంత గూటికి చేరారు.

Similar News

News December 1, 2024

తండ్రి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు: కేంద్రమంత్రి

image

తన తండ్రి భూపతి రాజు సూర్యనారాయణ రాజు పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఆదివారం ప్రకటించారు. భీమవరంలో తన తండ్రి సంస్మరణ సభలో శ్రీనివాస వర్మ మాట్లాడారు. తన తండ్రి వల్లే ఈ స్థాయికి చేరానని అన్నారు. రాబోయే రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తానని చెప్పారు. డయాలిసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తానని అన్నారు.

News December 1, 2024

వెలవెలబోయిన పేరుపాలెం బీచ్

image

కార్తీక మాసం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే పర్యాటకులతో కళకళలాడే పేరుపాలెం బీచ్ ఆదివారం వెలవెలబోయింది. అల్పపీడనం ఎఫెక్ట్‌తో బీచ్‌లో పెద్ద పెద్ద రాకాసి అలలు వస్తుండడంతో పోలీస్ యంత్రాంగం పర్యాటకులను రావొద్దని హెచ్చరించింది. దీంతో పర్యాటకులు బీచ్‌కు రాకపోవడంతో ఖాళీగా దర్శనమిచ్చింది.

News December 1, 2024

కాళ్ల: లారీని ఢీకొట్టిన బైక్.. ఒకరు స్పాట్ డెడ్

image

బతుకుతెరువు కోసం చేపలు వేటకు వెళ్తూ కాళ్ల మండలం సీసలి గ్రామంలో లారీని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. జువ్వలపాలెంకి చెందిన పైడిరాజు, చోడవరపు మధుబాబు బొండాడ లంక వేటకు వెళ్తూ ఎర్రయ్య రైస్ మిల్ వద్ద లారీని ఢీకొట్టారు. దీంతో పైడిరాజు మృతి చెందగా.. గాయపడిన మధుబాబును వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కాళ్ల ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.