News April 24, 2024

ప.గో.: మహిళపై అత్యాచారం.. జైలు

image

మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. కామవరపుకోట మండలం వీరిశెట్టివారిగూడేనికి చెందిన వితంతువుపై 2015లో అదే గ్రామానికి చెందిన నిజపరపు సత్యనారాయణ అలియాస్ సత్తియ్య అత్యాచారయత్నం చేసి పరారయ్యాడు. అప్పటి తడికలపూడి SIవిష్ణువర్ధన్ కేసు నమోదుచేసి దర్యాప్తుచేపట్టారు. తుది విచారణ అనతరం ఏలూరు 5వ అదనపు జిల్లాజడ్జి, మహిళా కోర్టు న్యాయమూర్తి రాజేశ్వరి ఈమేరకు తీర్పునిచ్చారు.

Similar News

News November 7, 2025

ప.గో: మధ్యాహ్న భోజనంపై ఆకస్మిక తనిఖీలు

image

ప.గో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లోని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పరిస్థితిని తెలుసుకునేందుకు జిల్లా యంత్రాంగం గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. కలెక్టర్ చదలవాడ నాగరాణి సహా 141 మంది అధికారులు 141 పాఠశాలల్లో పరిశీలించారు. ఇటీవల కాళ్లలో కుళ్లిన కోడిగుడ్లు బయటపడటంతో అధికారులు గుడ్లను నిశితంగా పరిశీలించారు. జిల్లాలో సుమారు 80 వేల మంది విద్యార్థులకు భోజనం అందుతోందని అధికారులు తెలిపారు.

News November 7, 2025

నరసాపురం వరకు పొడిగించిన వందే భారత్ రైలు

image

కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ చేసిన కృషి ఫలించింది. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు చెన్నై నుంచి విజయవాడ వరకు నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నరసాపురం వరకు పొడిగిస్తూ కేంద్ర రైల్వే శాఖ నుంచి దక్షిణ మధ్య రైల్వేకు గురువారం ఉత్తర్వులు అందాయి. దీంతో ఇక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News November 7, 2025

మత్తు పదార్థాల నివారణపై గట్టి నిఘా ఉంచాలి: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్ చాంబర్‌లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని ఇన్‌ఛార్జ్ జిల్లా మధ్య నిషేధ ఆబ్కారీ అధికారి ఆర్.వి. ప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా మత్తు పదార్థాల అమ్మకం, వినియోగం ఉండరాదని, దీనిపై క్షేత్రస్థాయిలో గట్టి నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.