News January 5, 2025

ప.గో: ముంచేసిన Instagram పరిచయం

image

పొన్నూరుకు చెందిన రామకృష్ణ అనే ఆర్మీ ఉద్యోగికి ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైన ప.గో.జిల్లా మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని రూ.8లక్షలు తీసుకొని మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె పిల్లల చదువుకోసం విజయవాడలో ఉంటున్నారు. రామకృష్ణకి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఆమెతో ఇష్టానుసారంగా మాట్లాడారు. మనస్తాపం చెందిన మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.

Similar News

News November 18, 2025

తణుకు: ‘తల్లిదండ్రులను చూడని పిల్లలు శిక్షార్హులు’

image

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి వారి పోషణ పట్టించుకోలేని పిల్లలు శిక్షార్హులు అవుతారని తణుకు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పోతర్లంక సాయిరాం అన్నారు. సోమవారం తణుకు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు ఆర్డీవో అధికారుల ద్వారా న్యాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.

ఆకివీడు: ఆన్‌లైన్ మోసం.. 39వేలు పోగొట్టుకున్న మహిళ

image

ఆకివీడులో ఆన్‌లైన్ మోసం వెలుగు చూసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో “రూ. 999కే మూడు డ్రెస్సులు” అనే ఆఫర్ నమ్మిన ఓ గృహిణి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దఫదఫాలుగా రూ.39 వేలు పోగొట్టుకున్నారు. బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఆకివీడు ఎస్ఐ హనుమంత నాగరాజుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు ధర్యాప్తు చేస్తున్నారు.