News July 28, 2024
ప.గో.: ముంపు గ్రామాల్లో మంత్రి నిమ్మల పర్యటన

పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో గోదావరి వరద ముంపునకు గురైన లంక గ్రామాల్లో ఆదివారం ఉదయం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. బాధితులను పరామర్శించి ప్రభుత్వ సహాయం అందించేందుకు కనకాయలంక, పెదలంక గ్రామాలకు గోదావరిపై పడవపై పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
Similar News
News December 13, 2025
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి: కలెక్టర్

గోదావరి క్రీడోత్సవాల్లో భాగంగా శనివారం భీమవరం ఎస్ఆర్ కెఆర్ ఇంజినీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం డివిజన్ ఉద్యోగుల క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..గోదావరి క్రీడోత్సవాల్లో భాగంగా నేటి నుంచి జిల్లావ్యాప్తంగా రెవెన్యూ డివిజన్ల వారీగా పోటీలు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని అన్నారు.
News December 13, 2025
నరసాపురంలో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభం

నరసాపురం కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను జిల్లా అదనపు న్యాయమూర్తి వాసంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా కక్షిదారులను ఉద్దేశించి న్యాయమూర్తి మాట్లాడుతూ..కేసులు పరిష్కారంలో రాజీయే రాజమార్గమన్నారు. దీనివల్ల కక్షలు పెరగవని కోట్లు చుట్టూ చుట్టూ తిరిగి సమయాన్ని డబ్బును వృథా చేసుకోవలసిన అవసరం ఉండదు అన్నారు.
News December 13, 2025
జాతీయ వినియోగదారుల దినోత్సవ సంబరాలపై సమీక్ష చేపట్టిన జేసీ

భీమవరం కలెక్టరేట్లో శుక్రవారం జాతీయ వినియోగదారుల దినోత్సవం సంబరాలు 2025 ఏర్పాట్లపై జిల్లా జాయింట్ కలెక్టర్ టీ రాహుల్ కుమార్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ..డిసెంబర్ 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో వినియోగదారుల హక్కులపై విస్తృత అవగాహన కల్పించే వారోత్సవాలు నిర్వహించాలని అన్నారు.


