News October 21, 2024

ప.గో: ముగిసిన పల్లె పండగ వారోత్సవాలు

image

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన పల్లె పండగ వారోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. అక్టోబర్ 14న ప్రారంభమైన ఈ వారోత్సవాలు 20వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి గ్రామంలో ఆయా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నిర్వహించారు. ఏలూరు జిల్లాలో 2,523 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టగా ₹.173.87 కోట్లు మంజూరు చేశారు.

Similar News

News November 4, 2024

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కైవల్య రెడ్డికి స్థానం

image

నిడదవోలుకు చెందిన ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న కుంచాల కైవల్యరెడ్డి ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్న తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఖగోళ శాస్త్రంపై ఆసక్తితో నాసావారి ఆధ్వర్యంలో ఎక్స వారు నిర్వహించిన అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం పూర్తి చేసిన అతి చిన్న వయస్కురాలైన భారతీయురాలిగా రికార్డు నమోదు చేసింది. సైన్స్, చిత్రలేఖనంలో ప్రతిభ చూపింది.

News November 3, 2024

సెమీఫైనల్‌కు చేరిన ఉమ్మడి పశ్చిమగోదావరి బాలికల జట్టు

image

పల్నాడు జిల్లా నరసరావుపేట మునిసిపల్ హైస్కూల్ నందు జరుగుతున్న 68వ రాష్ట్రస్థాయి S G F U/14 బాలబాలికల బాస్కెట్బాల్ పోటీల్లో బాలికల విభాగంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో గుంటూరు జట్టు మీద 26-13 స్కోర్‌తో విజయం సాధించి సెమీఫైనల్స్‌కు చేరుకుంది. ఆదివారం రాత్రి సెమీఫైనల్ పోటీల్లో పశ్చిమ జట్టు వేరే జట్టుపై తలపడనుందని పీడీ శ్రీనివాసరావు తెలిపారు.

News November 3, 2024

ప.గో: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. ఒకరికి గాయాలు

image

నల్లజర్ల మండలం పుల్లపాడు హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయి. మృతులు అనంతపురం శారదనగర్‌కు చెందిన కనకదుర్గ (70) అక్కడికక్కడే మృతి చెందగా.. సుసర్ల శ్రీలక్ష్మి (82)కి తీవ్రగాయాలవ్వడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వారు అనంతపురం నుంచి కాకినాడ వెళ్తున్నట్లు వివరించారు.