News July 24, 2024

ప.గో: ముద్రా రుణాల పెంపు.. కలలు సాకారమయ్యేనా?

image

ఉమ్మడి ప.గో జిల్లాలో 425 పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో దాదాపు 100 పరిశ్రమల వరకు మూతపడ్డాయి. ఇలాంటి క్రమంలో కేంద్రం చిన్న పరిశ్రమలను ఆదుకునేలా బడ్జెట్ ప్రవేశపెట్టడం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ముద్రా రుణాల పరిమితి రూ.10 లక్షలు ఉండగా ఈ బడ్జెట్‌లో రూ.20 లక్షలకు పెంచారు. ఈ ముద్రా లోన్ ద్వారా యువత కలలు సాకారం కానున్నాయి. అర్హులు రుణం పొందేలా బ్యాంకుల్లో ఆంక్షలను సడలించారు.

Similar News

News November 16, 2025

ఫోన్ కోసం అలిగి.. బాలుడు అదృశ్యం: ఎస్ఐ

image

సెల్ ఫోన్ చూడవద్దని తల్లి మందలించడంతో ఓ బాలుడు (11) అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన నరసాపురంలో చోటుచేసుకుంది. ఈ నెల 14న బాలుడు ఫోన్ పగులగొట్టి వెళ్లిపోయాడని, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై జయలక్ష్మి తెలిపారు. బాలుడి ఆచూకీ కోసం పట్టణం, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు వివరించారు.

News November 16, 2025

పెదఅమీరం: తొలి జీతం.. గ్రామదేవతకు అందజేత

image

కాళ్ల మండలం పెదఅమిరం గ్రామ దేవత శ్రీ పల్లాలమ్మ దేవాలయ అభివృద్ధికి ఉపాధ్యాయుడు బూరాడ వెంకటకృష్ణ శనివారం తన మొదటి జీతాన్ని అందజేశారు. మెగాడీఎస్సీ 2025 లో స్కూల్ అసిస్టెంట్(మాథ్స్) ఉద్యోగం సాధించిన వెంకటకృష్ణ తన తొలి జీతం మొత్తం రూ.50,099 లను ఆలయ అభివృద్ధి కమిటీ పెద్ద కోరా రామ్మూర్తికి అందజేశారు. ఆయనను పలువురు అభినందించారు.

News November 16, 2025

ఏపీకే ఫైలు ఓపెన్ చేయొద్దు: సీఐ యాదగిరి

image

చరవాణీలకు వచ్చే ఏపీకే ఫైలు తెరవొద్దని నరసాపురం పట్టణ సీఐ బి.యాదగిరి ప్రజలకు సూచించారు. ఆయన ఫోన్‌కు వాహన అపరాధ రుసుము చలానా పెండింగ్ ఉన్నట్లుగా మెసేజ్ వచ్చింది. ఆ ఫైలు సందేశాన్ని ప్రజలకు అవగాహన నిమిత్తం సామాజిక మాధ్యమంలో అందుబాటులో ఉంచారు. అటువంటి ఫైళ్లను తెరవొద్దని, తెరిస్తే ఫోన్ హ్యాక్ అయి సైబర్ నేరగాళ్ల చేతికి బ్యాంకు ఖాతాలు, పాస్‌వర్డ్ చేరే ప్రమాదం ఉందని ఆయన సూచించారు.