News July 18, 2024
ప.గో: మృతదేహాన్ని తరలిస్తున్న పడవ బోల్తా

దహన సంస్కారాలకు డెడ్‌బాడీని తరలిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటన ప.గో జిల్లా పాలకోడేరు మండలం కొండేపూడిలో గురువారం జరిగింది. గ్రామంలో ఓ వృద్ధుడు మరణించగా, మృతదేహన్ని శ్మశానవాటికకు తీసుకువెళ్లే క్రమంలో కాలువ దాటాల్సి వచ్చింది. వర్షాలకు ఉద్ధృతంగా ఉన్న ఆ కాలువ మీదుగా నాటు పడవలో డెడ్‌బాడీ తీసుకెళ్తుంటే ఒక్కసారిగా అది బోల్తా పడింది. అందరూ క్షేమంగా బయటపడగా.. కాలువపై వంతెన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Similar News
News February 6, 2025
తమ్ముడిపై దాడి చేసిన అన్న.. చికిత్స పొందుతూ మృతి: ఎస్ఐ శ్రీనివాస్

కాళ్ల మండలంలో అన్నదమ్ముల మధ్య స్థల విషయంలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం అన్న సత్యనారాయణ తమ్ముడు రమేశ్‌పై దాడి చేయగా భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కాళ్ల ఎస్ఐ ఎన్. శ్రీనివాస్ గురువారం తెలిపారు. పెదఅమిరంకు చెందిన రమేశ్ భార్య వరలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
News February 6, 2025
ఫైళ్ల క్లియరెన్స్.. నిమ్మలకు 22వ ర్యాంకు

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో ప.గో జిల్లా మంత్రి నిమ్మల రామానాయుడు 22వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.
News February 6, 2025
ప.గో: అధికారులతో కలెక్టర్ సమావేశం

19 ఏళ్ల లోపు పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలను తప్పక ఇప్పించేలా సంబంధిత శాఖలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. బుధవారం భీమవరం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఫిబ్రవరి 10న నిర్వహించే జాతీయ నులిపురుగుల దినోత్సవంపై వివిధ శాఖల అధికారులతో కన్వర్జెన్సీ నిర్వహించి పలు సూచనలను జారీ చేశారు. నిర్దేశించిన సమయానికి ఆల్బెండజోల్ ఇవ్వాలన్నారు.