News January 14, 2025

ప.గో: మొదటిరోజు..100 కోట్లు పైనే..

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం భోగి రోజు కోడిపందాలు జోరుగా సాగాయి. పక్క రాష్ట్రాల నుంచి పందెం రాయుళ్లు పాల్గొని పెద్ద ఎత్తున పందాలు కాశారు. పందాల పేరిట కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారాయి. మొదటిరోజు కోడిపందాలు, గుండాట, పేకాటల ద్వారా సుమారు రూ.100 కోట్ల రూపాయలు పైనే చేతులు మారినట్లుగా అంచనా.

Similar News

News February 9, 2025

రోడ్డుప్రమాదంలో తాడేపల్లిగూడెం మహిళ మృతి

image

ప్రత్తిపాడులో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో తాడేపల్లిగూడెం(M) కొండ్రుపోలుకు చెందిన లక్ష్మి మృతిచెందింది. భర్త సత్యనారాయణతో దువ్వలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ప్రత్తిపాడు హైవేపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె తలకు గాయమై చనిపోయింది. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI స్వామి తెలిపారు.

News February 9, 2025

దొంగను పట్టించిన నరసాపురం వాసులు

image

ఏసీ బోగీల్లో పనిచేస్తూ ఫోన్లు దొంగలిస్తున్న ఓ వ్యక్తిని గుంటూరు రైల్వే పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నరసాపురానికి చెందిన నాగూర్ వలి తన భార్య బేగం, ఇద్దరు పిల్లలతో కలిసి శుక్రవారం లింగంపల్లి నుంచి నరసాపురం ఎక్స్‌ప్రెస్‌ 2ACలో ప్రయాణించారు. వారు ఫోన్ ఛార్జింగ్ పెట్టినిద్రపోగా.. వివేక్ ఫోన్ దొంగలించాడు. దీంతో అతడిని పట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 9, 2025

ప.గో: త్రాగునీరు కొరత లేకుండా చూడాలి: కలెక్టర్ 

image

వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించి, తాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నీటి కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.

error: Content is protected !!