News August 8, 2024

ప.గో: రూ.2లకే బిర్యానీ.. ఎగబడిన జనం

image

ప.గో జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఓ రెస్టారెంట్‌లో గురువారం రూ.2లకే బిర్యానీ ఇవ్వడంతో జనాలు భారీగా తరలివచ్చారు. రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వాహకులు ఈ ఆఫర్ ప్రకటించారు. 2 రోజులుగా దీనిపై ప్రచారం చేయడంతో బిర్యానీ ప్రియులు ఎగబడ్డారు. 2000 మంది వస్తే 200 బిర్యానీ ప్యాకెట్స్ మాత్రం ఇచ్చారని పలువురు ఆరోపించారు. ఈ క్రమంలో ట్రాఫిక్ జాం అయ్యి వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

Similar News

News November 18, 2025

జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలి: కలెక్టర్

image

జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని, దీనిపై అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో గంజాయిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు.

ఈ ఏడాదిలో 40.399 కేజీల గంజాయి సీజ్: ఎస్పీ

image

మాదకద్రవ్యాల నియంత్రణలో ఈ ఏడాది 12 కేసులు నమోదు అయ్యాయని, 55 మందిని అరెస్టు చేయగా 40.399 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందని ఎస్పీ నయీం అస్మీ తెలిపారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. దీని విలువ సుమారు రూ.3,72,680 లు ఉంటుందని, 2 వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 64 కేసుల్లో సీజ్ చేసిన మొత్తం 641.544 కిలోల గంజాయిని జూలై 9న దహనం చేయడం జరిగిందన్నారు.