News July 13, 2024

ప.గో.: రూ.7లక్షలకు బ్యాంక్‌లో ఉద్యోగమంటూ మోసం

image

ఏలూరుకు చెందిన ఓ వ్యక్తి కొందరితో ముఠాగా ఏర్పడి ఉమ్మడి ప.గో.లోని నిరుద్యోగులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడేనికి చెందిన డిగ్రీ చదివిన రాశికి బ్యాంక్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని రూ.7లక్షలు డిమాండ్ చేశారు. నమ్మి డబ్బు కట్టగా నకిలీ అపాయింట్ మెంట్ ఇచ్చి, శిక్షణ సైతం ఇచ్చారు. తీరా ఉద్యోగం లేదని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో దందా వెలుగులోకి వచ్చింది.

Similar News

News November 22, 2025

ప.గో: హెలికాప్టర్ దిగగానే.. పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ ఇదిగో!

image

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 24న ద్వారకాతిరుమల మండలంలో పర్యటిస్తారు. కొయ్యలగూడెం (M) రాజవరంలో హెలిప్యాడ్‌లో దిగి అక్కడ నుంచి ద్వారకాతిరుమల మండలం జగన్నాథపురం చేరుకుంటారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన చేస్తారు. ముందుగా ఆయన స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఏర్పాట్లను కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు.

News November 22, 2025

ప.గో: జాతీయ స్థాయి యోగా పోటీలకు ఇరువురి ఎంపిక

image

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు బడుగు చంద్రశేఖర్ (మోదుగ గుంట), హెచ్. రమాదేవి (చెరుకువాడ) ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వచ్చే ఏడాది జనవరిలో గోవాలో జరగనున్న యోగా పోటీల్లో పాల్గోనున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు బడుగు చంద్రశేఖర్ శుక్రవారం రాత్రి తెలిపారు.

News November 21, 2025

ప.గో: రూ. 2కోట్లు గోల్ మాల్ ?

image

తణుకులోని ఓ ప్రైవేటు బ్యాంకులో తాకట్టు బంగారం గోల్‌మాల్‌ అయిన వ్యవహారం రాజుకుంటోంది. గతంలో ఇక్కడ పనిచేసిన సిబ్బందితో చేతులు కలిపిన తణుకు శాఖ మేనేజర్‌ ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని సొంత అవసరాలకు వాడుకున్న వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. ఖాతాదారులు నిలదీయడంతో బ్యాంకు అధికారులు బయట బంగారం కొనుగోలు చేసి ఇచ్చారు. ఇలా సుమారు రూ.2 కోట్లు విలువైన బంగారాన్ని దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది.