News August 26, 2024
ప.గో: రూ.90.51 కోట్ల బ్యాంక్ రుణాల పంపిణీ
ప.గో జిల్లాలో 736 మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు లక్ పతి దీదీ ప్రోగ్రాం కింద రూ.90.51 కోట్ల బ్యాంక్ రుణాల చెక్కులను పంపిణీ చేసినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రోగ్రాంను ప్రారంభించగా.. ప.గో జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ నాగరాణి, తదితర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News September 13, 2024
17 నుంచి స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలు
ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఈ సందర్భంగా అధికారులతో శుక్రవారం ఆమె సమీక్షించారు. స్వచ్ఛతా కి భాగీదారి ప్రజల భాగస్వామ్యం, అవగాహన, సహకారం ఎంతో అవసరమన్నారు. ఈ నెల 17న మానవహారం, 20న మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ప్రణాళిక బద్ధంగా కార్యక్రమాల నిర్వహణకు అధికారులు సిద్ధం కావాలన్నారు.
News September 13, 2024
పరిశ్రమల ప్రోత్సాహానికి రూ.3.07కోట్లు మంజూరు
జిల్లాలో పరిశ్రమల ప్రోత్సాహానికి వివిధ రాయితీలు కింద రూ.3.07కోట్లు మంజూరు చేయడం జరిగిందని ప.గో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని శుక్రవారం వశిష్ట సమావేశ మందిరంలో నిర్వహించారు. సింగిల్ విండో పథకం కింద అనుమతులను కాలయాపన లేకుండా మంజూరు చేయాలని ఆదేశించారు. ఓఎన్‌డీసీ ప్లాట్ ఫామ్‌లో అన్ని ఎంఎస్ఎంఈ యూనిట్లు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.
News September 13, 2024
17న నులిపురుగుల నిర్మూలన నివారణ దినోత్సవం
జిల్లాలో ఈ నెల 17వ తేదీన నులిపురుగుల నిర్మూలన నివారణ దినోత్సవంగా నిర్వహించనున్నామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె శుక్రవారం నులిపురుగుల నివారణ, ఆల్బెండ్జోల్ మాత్రలు అవశ్యకతకు సంబంధించి ప్రచార వీడియోలు, కరపత్రాలను ఆవిష్కరించారు. 19 ఏళ్ల లోపు వారికి నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీకి చర్యలు తీసుకోవాలని అన్నారు.