News August 15, 2024
ప.గో.: రెండు గంటల్లో కిడ్నాప్ కేసు ఛేదన

పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామానికి చెందిన బాలిక 14వ తేదీ (నిన్న) రాత్రి కిడ్నాప్‌కు గురైంది. బాలిక తండ్రి పాలకోడేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. రాత్రివేళ బొలెరో వాహనంలో వచ్చి తన కూతురుని కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు రంగంలో దిగారు. కిడ్నాప్ చేసిన వ్యక్తి పాలకోడేరుకు చెందిన హనుక్గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా SP సిబ్బందిని అభినందించారు.
Similar News
News December 12, 2025
భీమవరం: లింక్ క్లిక్.. సినిమా స్టైల్లో నగదు మాయం

భీమవరంలోని శివరావుపేటకు చెందిన శ్రీరామదాసు సైబర్ మోసానికి గురయ్యాడు. ఫోన్‌కు వచ్చిన లింక్‌పై క్లిక్ చేయడంతో బ్యాంక్ అకౌంట్ నుంచి సినిమాలో చూపించే తరహాలో రూ.1,70,400 ఐదు దఫాలుగా వెంట వెంటనే కట్ అయిపోయాయి. దీంతో బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ నంబర్ 1930కు ఫిర్యాదు చేశాడు. భీమవరం టూటౌన్ సీఐ కాళీచరణ్ అకౌంట్లలో ఉన్న రూ.90 వేలు ఫ్రీజ్ చేయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 12, 2025
ప.గో : ఇకపై వాహన చలానాలు ఇలా..!

వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసే సమయంలో ట్రాఫిక్ పోలీసులు విధించే చలానాలు ఇకపై ఫోన్‌పే ద్వారా చెల్లించాలని తణుకు పట్టణ సీఐ ఎన్.కొండయ్య కోరారు. ఫోన్‌పేలో కొత్తగా ఈ ఛాలాన్ అనే టాబ్ ద్వారా వాహనం నంబర్ ఎంటర్ చేస్తే చలానాలు కనిపిస్తాయన్నారు. వాటిని తక్షణమే ఒక సెకన్లో చెల్లించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సీఐ కొండయ్య కోరారు.
News December 11, 2025
జిల్లాలో 1315 పోలియో బూత్‌లు ఏర్పాటు: కలెక్టర్

జిల్లాలో ఈనెల 21న పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించాలని కలెక్టర్ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో 0-5 సంవత్సరాల వయసు కలిగిన 1,87,204 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయవలసి ఉందన్నారు. దీని కోసం 1,315 పోలియో బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు 5,520 మంది ఉద్యోగులు విధులకు హాజరుకావాలని కోరారు.


