News August 15, 2024
ప.గో.: రెండు గంటల్లో కిడ్నాప్ కేసు ఛేదన
పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామానికి చెందిన బాలిక 14వ తేదీ (నిన్న) రాత్రి కిడ్నాప్‌కు గురైంది. బాలిక తండ్రి పాలకోడేరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. రాత్రివేళ బొలెరో వాహనంలో వచ్చి తన కూతురుని కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు రంగంలో దిగారు. కిడ్నాప్ చేసిన వ్యక్తి పాలకోడేరుకు చెందిన హనుక్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా SP సిబ్బందిని అభినందించారు.
Similar News
News September 11, 2024
ఏలూరు: గణేశ్ నిమజ్జనంలో వ్యక్తి గల్లంతు.. మృతదేహం లభ్యం
నిడదవోలులోని బసిరెడ్డిపేట రేవు వద్ద వినాయక నిమజ్జన సమయంలో చాగల్లు మండలం బ్రాహ్మణగూడేనికి చెందిన రాజేష్ పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలో <<14072518>>గల్లంతైన<<>> విషయం తెలిసిందే. యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన జాలర్లకు మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదుచేశారు.
News September 11, 2024
దేవరపల్లి యాక్సిడెంట్.. CM తీవ్ర దిగ్భ్రాంతి
దేవరపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏడుగురు కూలీలు ప్రాణాలు కోల్పోవడం తనను కలిచివేసిందన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News September 11, 2024
ప.గో. జిల్లాలో సీఎం పర్యటన రద్దు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకివీడులో హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి అనువుగా లేనందున పర్యటనలో మార్పుచేసినట్లు అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లాలో పర్యటన యథావిధిగా కొనసాగనుండగా, పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం పర్యటన రద్దు అయినట్లు కలెక్టర్ తెలిపారు.