News April 13, 2025
ప.గో: రెండు నెలలు చేపల వేట బంద్

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రెండు నెలల పాటు చేపల వేట నిషేంధించినట్లు ప.గో జిల్లా మత్స్యశాఖ అధికారులు శనివారం తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదన్నారు. మత్స్య సంపద పరిరక్షణ, పునరుత్పత్తి, నిర్వహణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Similar News
News October 27, 2025
తణుకు: జాతీయ రహదారిపై నిలిచిన ఆర్టీసీ బస్సు

ఆర్టీసీ బస్సుల నిర్వహణ తీరు అధ్వానంగా మారిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. తాజాగా, కాకినాడ డిపోనకు చెందిన బైపాస్ ఎక్స్‌ప్రెస్ బస్సు (విజయవాడ-కాకినాడ) ఆదివారం రాత్రి తణుకు సర్మిష్ట సెంటర్ జాతీయ రహదారిపై నిలిచిపోయింది. ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే బస్సు ఆగిపోయిందని అధికారులు తెలిపారు. ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు తరలించారు.
News October 27, 2025
పేరుపాలెం బీచ్‌కు నో ఎంట్రీ

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఎస్.ఐ. జి. వాసు తెలిపారు. సోమ, మంగళ, బుధవారాలు (మూడు రోజులు) బీచ్‌కు పర్యాటకులు, యాత్రికులు రావద్దని, తుఫాను కారణంగా హెచ్చరికలు జారీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
News October 27, 2025
ప.గో: మొంథా’ తుఫాన్.. నేటి పీజీఆర్ఎస్ రద్దు

‘మొంథా’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అక్టోబర్ 27వ తేదీ సోమవారం కలెక్టరేట్లో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మండల, డివిజన్, జిల్లా స్థాయిలో రద్దు చేసినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ‘మొంథా’ తుఫాన్ కారణంగా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు.


