News January 11, 2025
ప.గో: రెండు బస్సులు సీజ్.. రూ.14లక్షలు ఫైన్

సంక్రాంతి పండుగ సందర్భంగా దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల వద్ద నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ అధిక రేట్లతో టికెట్లను అమ్ముతున్నారని సమాచారం మేరకు రవాణా శాఖ అధికారులు ప.గో.జిల్లాలో శనివారం తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి బస్సులు నడిపితే కఠినంగా శిక్షిస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ తనిఖీల్లో 96 కేసులు నమోదు చేసి, రూ.14లక్షలు ఫైన్ వేసి, 2బస్సులను సీజ్ చేశామన్నారు.
Similar News
News February 25, 2026
ప.గో: ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ

ప.గో జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ఈ నెల 28నే పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. మార్చి 1 ఆదివారం కావడంతో, ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పంపిణీకి ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. జిల్లాలోని 2,22,982 మంది లబ్ధిదారులకు రూ. 96.39 కోట్లను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. శనివారం ఉదయమే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేయాలని అధికారులను ఆదేశించారు.
News February 25, 2026
నరసాపురం: వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి

నరసాపురం మండలం వేములదీవి పడమరలో బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. బుధవారం ఉదయం చేపల వేటకు వెళ్లిన బొమ్మిడి యేసుబాబు(53) అనే మత్స్యకారుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే నరసాపురం తహశీల్దార్ ఐవీవీ సత్య నారాయణ, ఆర్‌ఐ సురేఖ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
News February 25, 2026
పాలకొల్లు: మేకా శేషుబాబుపై సస్పెన్షన్ ఎత్తివేత

మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబుపై విధించిన సస్పెన్షన్‌ను వైసీపీ అధిష్ఠానం ఎత్తివేసింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు మంగళవారం రాత్రి ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. ఇటీవల వైఎస్ జగన్‌ను కలిసి తన కుమారుడి వివాహానికి ఆహ్వానించిన శేషుబాబు, త్వరలోనే రీఎంట్రీ ఇస్తారనే ప్రచారానికి ఈ నిర్ణయంతో బలం చేకూరింది. పార్టీ ప్రకటనతో ఆయన అనుచరులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


