News January 11, 2025

ప.గో: రెండు బస్సులు సీజ్.. రూ.14లక్షలు ఫైన్

image

సంక్రాంతి పండుగ సందర్భంగా దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల వద్ద నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ అధిక రేట్లతో టికెట్లను అమ్ముతున్నారని సమాచారం మేరకు రవాణా శాఖ అధికారులు ప.గో.జిల్లాలో శనివారం తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి బస్సులు నడిపితే కఠినంగా శిక్షిస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ తనిఖీల్లో 96 కేసులు నమోదు చేసి, రూ.14లక్షలు ఫైన్ వేసి, 2బస్సులను సీజ్ చేశామన్నారు.

Similar News

News January 17, 2025

ప.గో: బరువెక్కిన గుండెతో పయనం

image

ప.గో జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులు సంక్రాంతి పండుగ ముగించుకుని పట్టణాలకు పయనమయ్యారు. ఈ సందర్భంగా పండుగ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. అప్పుడే పండుగ ముగిసిందా అన్నట్లుగా ఉద్యోగ, వ్యాపారాల రీత్యా పట్టణాలకు వెళ్తున్నారు. ఈసంక్రాంతి సంబరాలను రాబోయే పండగ వరకు నెమరువేసుకుంటూ సంతోషిస్తామని పలువురు ప్రయాణికులు తెలిపారు. పిండి వంటలతో పట్టణాలకు పయనమయ్యేవారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిశాయి.

News January 17, 2025

ఏలూరు: హీటర్ ఆన్ చేసి మరిచిపోయి వ్యక్తి సజీవదహనం

image

హీటర్ పెట్టి బకెట్ కరిగి కరెంట్ షాక్‌తో వ్యక్తి సజీవదహనమైన ఘటన ఏలూరులో గురువారం జరిగింది. కాకినాడకు చెందిన గంగాధర్ (30) తాత డెత్ సర్టిఫికెట్ కోసం ఏలూరులోని అక్క ఇంటికి వచ్చాడు. మద్యం తాగి నిద్రిస్తుండగా.. అక్క గడియ పెట్టుకుని బయటకు వెళ్లింది. గంగాధర్ లేచి నీళ్లు పెట్టుకుని మళ్లీ నిద్రపోయాడు. ఎక్కువ సేపు ఉండిపోవడంతో ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని 1 టౌన్ CI సత్యనారాయణ పరిశీలించినట్లు తెలిపారు.

News January 17, 2025

మొగల్తూరులో అల్లుడికి 153 రకాల వంటకాల విందు

image

మొగల్తూరుకు చెందిన కెల్లా లక్ష్మీ కాంతం అల్లుడికి 153 రకాలతో విందు ఏర్పాటు చేశారు. తన కూతురు నాగలక్ష్మిని పాలకొల్లుకి చెందిన చిప్పాడ విజయ కృష్ణతో 29 ఏళ్ల క్రితం  వివాహం జరిపించారు. కొత్త అల్లుడికి ఏమాత్రం తీసిపోకుండా 153 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.