News March 28, 2025
ప.గో: రెండు రోజులు జాగ్రత్త

రానున్న రెండు రోజులు ప.గో జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇవాళ తాడేపల్లిగూడెంలో 40.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే పెంటపాడు, తణుకులో 40.6, అత్తిలి, ఆకివీడులో 40.1, ఇరగవరంలో 39.8, ఉండిలో 39.6, పెనుమంట్రలో 39.3, పెనుగొండలో 39.2, పాలకోడేరులో 39.1 డిగ్రీల ఎండ కాస్తుంది. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. టోపీ, గొడుగు వాడాలి.
Similar News
News October 27, 2025
ప.గో: మొంథా’ తుఫాన్.. నేటి పీజీఆర్ఎస్ రద్దు

‘మొంథా’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అక్టోబర్ 27వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మండల, డివిజన్, జిల్లా స్థాయిలో రద్దు చేసినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ‘మొంథా’ తుఫాన్ కారణంగా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు.
News October 26, 2025
ప.గో.: కలెక్టర్, జేసీతో సమావేశమైన ప్రసన్న వెంకటేశ్

మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాకు కేటాయించిన ప్రత్యేక పర్యవేక్షణ అధికారి వి. ప్రసన్న వెంకటేశ్ ఆదివారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్‌తో ఆయన సమావేశమయ్యారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు, ముందస్తుగా తీసుకున్న చర్యలపై సమీక్షించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
News October 26, 2025
ప.గో: రెండు రోజలు విద్యాసంస్థలకు సెలవులు

‘మొంథా’ తుఫాను నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఈ నెల 27, 28 తేదీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. కళింగపట్నం, కాకినాడ మధ్య ఈ నెల 27న తుఫాను తీరం దాటుతున్నందున ఇప్పటికే జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


