News April 24, 2024

ప.గో.: రేపు నరసాపురం కూటమి అభ్యర్థి నామినేషన్ 

image

నర్సాపురం పార్లమెంట్ కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రేపు నామినేషన్ వేయనున్నారు. ఉదయం పెద అమిరంలోని NTR విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ చేరుకొని ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందిస్తారని కూటమి నాయకులు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు.

Similar News

News November 10, 2025

యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని ఆమె వెల్లడించారు. ప్రజలు 1100కు కాల్ చేసి కూడా సమస్యలు తెలియజేయవచ్చని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అలాగే Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

News November 9, 2025

తణుకు: బీసీ వసతి గృహంలో కలెక్టర్ తనిఖీలు

image

తణుకులోని పాత ఊరు బాలికల బీసీ హాస్టల్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థినులతో మాట్లాడి, అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, రుచిగా ఉందా అని ఆరా తీశారు. డైనింగ్ హాల్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

News November 9, 2025

ఇరగవరం: విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

image

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామయ్యపాలెం వద్ద ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరి కోత మిషన్‌ను వ్యాన్‌లో తరలిస్తుండగా, 11 కేవీ విద్యుత్ తీగలు తగిలాయి. ఈ ప్రమాదంలో ప.గో జిల్లా ఇరగవరం మండలానికి చెందిన కె. సింహాద్రి అప్పన్న (58), జి. సందీప్ (26) విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతితో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.