News November 30, 2025

ప.గో: రేపు పెన్షన్ పంపిణీకి సర్వం సిద్ధం.!

image

ప.గో జిల్లాలో 2,25,132 మంది లబ్ధిదారులకు రూ.97.29 కోట్ల సామాజిక పెన్షన్ల పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను సోమవారం ఉదయం నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి సచివాలయం సిబ్బందికి తగు ఆదేశాలు జారీచేసినట్లు చెప్పారు. సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సకాలంలో పంపిణీ చేస్తారన్నారు.

Similar News

News March 6, 2026

ఆక్వా రైతుల నమోదును వేగవంతం చేయాలి: జేసీ

image

జిల్లాలోని ఆక్వా రైతుల సమస్యలపై జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం భీమవరం కలెక్టరేట్‌లో మత్స్యశాఖ, తూనికలు-కొలతలు, వాణిజ్య పన్నులు, ఎంపెడ అధికారులతో సమీక్షించారు. ఆక్వా రైతులంతా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే, ఆక్వా ఫీడ్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు.

News March 5, 2026

భీమవరం: మహిళా దినోత్సవ నిర్వహణపై జేసీ సమీక్ష

image

ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం విష్ణు కళాశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లడారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వేడుకల నిర్వహణకు ప్రత్యేక అధికారులు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మహిళా సాధికారత ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాలు ఉండాలని ఆయన సూచించారు.