News March 9, 2025
ప.గో: రేపు యథావిధిగా పీజీఆర్ఎస్

మార్చి 10 నుంచి ప్రతి సోమవారం యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా గత నెల రోజులుగా తాత్కాలికంగా నిలుపుదల చేసిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని రేపటి నుంచి యథావిధిగా ప్రారంభిస్తామని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.
Similar News
News March 10, 2025
భీమవరం: పీజీఆర్ఎస్కు 367 అర్జీలు

భీమవరం పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని అర్జీలను స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. నేటి పీజీఆర్కు 367 అర్జీలు వచ్చాయని తెలిపారు. వాటిని సంబంధిత అధికారులు పంపించి త్వరగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ తదితరులు పాల్గొన్నారు.
News March 10, 2025
P24 సర్వే శ్రద్ద పెట్టి చేయాలి: జిల్లా కలెక్టర్

ఆకివీడులో జరుగుతున్న P4 సర్వేను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో P4 సర్వే నిర్వహిస్తున్నామన్నారు. సర్వే చేసేటప్పుడు శ్రద్ధ పెట్టి చేయాలని, ఎలాంటి తప్పులు ఉండకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, వార్డు సచివాలయ అధికారి దాసిరెడ్డి పాల్గొన్నారు
News March 10, 2025
భీమవరంలో నలుగురు క్రికెట్ బుకీలు అరెస్ట్

భారత్ -న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగింది. భీమవరం పట్టణంలోని నరసయ్య అగ్రహారానికి చెందిన కొందరు యువకులు దీనిపై క్రికెట్ బుకింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు వన్ టౌన్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.