News November 3, 2024

ప.గో: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. ఒకరికి గాయాలు

image

నల్లజర్ల మండలం పుల్లపాడు హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయి. మృతులు అనంతపురం శారదనగర్‌కు చెందిన కనకదుర్గ (70) అక్కడికక్కడే మృతి చెందగా.. సుసర్ల శ్రీలక్ష్మి (82)కి తీవ్రగాయాలవ్వడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వారు అనంతపురం నుంచి కాకినాడ వెళ్తున్నట్లు వివరించారు.

Similar News

News December 1, 2025

తణుకులో గుర్తుతెలియని మృతదేహం కలకలం

image

తణుకు పట్టణంలో సోమవారం గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రాష్ట్రపతి రోడ్డులోని కోర్టు సమీపంలో సుమారు 50 ఏళ్లు వయసు కలిగిన మృతదేహం ఉన్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు స్థానికంగా యాచకం చేస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

News December 1, 2025

AP NIT, YSR ఉద్యాన వర్సిటీ మధ్య MOU

image

తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్(AP NIT)తో వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం సోమవారం అవగాహన ఒప్పందం(MOU) చేసుకుంది. డ్రోన్ టెక్నాలజీ, డ్రయ్యర్ టెక్నాలజీ, నీటి పారుదలలో ఆధునిక యాంత్రికరణ, తెగుళ్లు గుర్తించడం, నానో టెక్నాలజీ తదితర అంశాల్లో రైతులకు అవగాహన కల్పించి ఖర్చులు తగ్గించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఏపీ నిట్ డైరెక్టర్ రమణ రావు, యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.శ్రీనివాసులు తెలిపారు.

News December 1, 2025

మొగల్తూరు: ‘నేడు పేరుపాలెం బీచ్‌కు రావొద్దు’

image

తుఫాను హెచ్చరికలు, సముద్రంలో అలల ఉద్ధృతి కారణంగా జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పేరుపాలెం బీచ్‌కి సోమవారం సందర్శకులను అనుమతించబోమని మొగల్తూరు ఎస్ఐ జి.వాసు తెలిపారు. వాతావరణ మార్పులతో అలలు వేగంగా వస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పర్యాటకులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలన్నారు. బీచ్ సందర్శనకు రావొద్దని సూచించారు.