News August 22, 2024

ప.గో.: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

image

విజయవాడలో బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ప.గో. జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాలు.. ఆకివీడు మండలం సమతానగర్‌కు చెందిన కొట్నాని తారకరామారావు (37) విజయవాడలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు స్టేషన్ నుంచి బైక్‌పై ఇంటికి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో ఓ లారీ అతణ్ని వెనక నుంచి ఢీ కొట్టగా మృతిచెందాడు. ఎనిమిదేళ్ల క్రితం అతని సోదరుడు సైతం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.

Similar News

News November 13, 2025

అప్సడా రిజిస్ట్రేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో అప్సడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి బుధవారం అధికారులను ఆదేశించారు. జిల్లాలో 1.33 లక్షల ఎకరాల ఆక్వా సాగు జరుగుతుండగా, కేవలం 60 వేల ఎకరాలు మాత్రమే అప్సడాలో రిజిస్ట్రేషన్ అయ్యాయని సమీక్షలో గుర్తించారు. మిగిలిన ఆక్వా సాగు ప్రాంతాన్ని కూడా త్వరగా రిజిస్ట్రేషన్ చేయాలని ఆమె అధికారులకు స్పష్టం చేశారు.

News November 12, 2025

దివ్యాంగులకు ప్రభుత్వ సహకారం: కలెక్టర్ నాగరాణి

image

ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులను ఎంతో ఓర్పుతో సాకాల్సి ఉంటుందని కలెక్టర్ నాగరాణి అన్నారు. వారి ఇబ్బందులకు ఎల్లప్పుడూ ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని, ధైర్యంగా ఉండాలని ఆమె భరోసా ఇచ్చారు. భీమవరంలో గాలి రామయ్య మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న ‘భవిత విలీన విద్య వనరుల కేంద్రాన్ని సందర్శించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ బాలికలకు ఉచిత ఉపకరణాల పంపిణీ, వైద్య నిర్ధారణ శిబిరాన్ని పరిశీలించారు.

News November 12, 2025

ఆకివీడు: డిప్యూటీ సీఎం చొరవతో నేడు గృహప్రవేశం

image

చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్న ఆకివీడుకు చెందిన వృద్ధురాలు కంకణాల కృష్ణవేణి ఇళ్లు లేక ఇబ్బంది పడుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌ను గత మూడు నెలల క్రితం మంగళగిరిలో ఆమె పవన్‌ను కలిసి తన గోడును విన్నవించుకుంది. పవన్ ఆదేశాలతో ఇంటి నిర్మాణంలో భాగంగా, నేడు కలెక్టర్ నాగరాణి చేతుల మీదుగా కృష్ణవేణి గృహప్రవేశం చేసింది. సొంతింటి కల నెరవేరడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది.