News June 4, 2024
ప.గో.లో ఐదుగురు కూటమి అభ్యర్థుల గెలుపు
ప.గో. జిల్లాలో కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు, చింతలపూడిలో విజయం సాధించగా.. తాజాగా తణుకులో కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ 71059 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.
Similar News
News November 6, 2024
ఉండి: ట్రైనింగ్‌లో కుప్పకూలి టీచర్ మృతి
టీచర్ ఆకస్మికంగా మృతిచెందిన ఘటన ప.గో జిల్లాలో జరిగింది. ఉండి మండలం ఉనుదుర్రు హైస్కూల్ ఇన్‌ఛార్జ్ HM తోట రత్నకుమార్ ఆగిరిపల్లి హీల్ స్కూల్‌లో నిర్వహిస్తున్న లీడర్షిప్ శిక్షణకు హాజరయ్యారు. ఈక్రమంలో అక్కడ బుధవారం ఉదయం గుండె నొప్పి రావడంతో చనిపోయారు. తీవ్రమైన ఒత్తిడి, వైద్య సదుపాయాలు లేని అటవీ ప్రాంతంలో శిక్షణ ఇవ్వడంతోనే రత్నకుమార్ చనిపోయారని ఇతర టీచర్లు ఆరోపించారు.
News November 6, 2024
ప.గో: ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ ఈనెల 11వ తేదీ నుంచి అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం తెలిపారు. ఈనెల 18 నామినేషన్ చివరి తేదీ అని, 19న పరిశీలన, 21న ఉప సవరణ చివరి తేదీ అని అన్నారు. డిసెంబర్ 5వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 4 గంటల ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. డిసెంబర్ 9వ తేదీన లెక్కింపు జరుగుతుందని తెలిపారు.
News November 6, 2024
ప.గో: TODAY TOP NEWS
* సీఎం చంద్రబాబును కలిసిన మాజీ MLA శేషారావు
*ఉండ్రాజవరం: 6కు చేరిన మృతుల సంఖ్య
*JRG: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
*ఏలూరు: 7న జరగాల్సిన జాబ్ మేళా రద్దు
*చింతలపూడి: 515.160 M.T ధాన్యం కోనుగోలు
*దేవరపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు
*జగన్నాథపురంలో కొబ్బరి చెట్టు ఎక్కిన త్రాచుపాము
*తణుకు: మద్యం మత్తులో హత్య.. వీడిన మిస్టరీ
*మంత్రి లోకేశ్‌తో ఉండి ఎమ్మెల్యే భేటీ