News June 4, 2024

ప.గో.లో జనసేన క్లీన్ స్వీప్

image

ప.గో. జిల్లాలోని 15 స్థానాల్లో కూటమి పొత్తులో భాగంగా జనసేన 6 చోట్ల పోటీ చేసిన విషయం తెలిసిందే. కాగా అన్నింటా స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ఒక్క పోలవరంలో తొలి 4 రౌండ్లలో వైసీపీ ఆధిక్యం ప్రదర్శించగా.. ఆ తర్వాత జనసేన పుంజుకుంది. అక్కడ ప్రస్తుతం 6 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తవగా.. 1614 ఓట్ల మెజారిటీ నడుస్తోంది.

Similar News

News December 8, 2025

టెట్ పరీక్షలకు జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు: జేసీ

image

డిసెంబర్ 10 నుంచి 21 వరకు జరిగే టెట్(TET) పరీక్షల కోసం జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. భీమవరంలో 5, నరసాపురంలో 1, తాడేపల్లిగూడెంలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 12,985 మంది అభ్యర్థులు హాజరవుతారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

News December 8, 2025

‘పరీక్షా పే చర్చ’.. ఉమ్మడి జిల్లాకు కోఆర్డినేటర్లు నియామకం

image

‘పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు పశ్చిమ, ఏలూరు జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమించినట్లు డైట్ ప్రిన్సిపాల్ ఎం.కమలకుమారి తెలిపారు. పశ్చిమ గోదావరికి ఎం.విజయప్రసన్న, బి.జాన్సన్‌లు, ఏలూరు జిల్లాకు వై.స్వరాజ్యశ్రీనివాస్, సీహెచ్ గోవిందరాజులు, శామ్యూల్‌ సంజీవ్‌లు ఎంపికయ్యారు. ఈనెల 11వ తేదీ వరకు జరిగే రిజిస్ట్రేషన్లను పర్యవేక్షించాలని ఆమె సూచించారు.

News December 8, 2025

భీమవరం: రక్తదాన వార్షికోత్సవ గోడపత్రికలు ఆవిష్కరణ

image

భీమవరం కలెక్టరేట్‌లో జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి ప.గో.జిల్లా యూనిట్ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాలో 2026వ సంవత్సర వార్షిక రక్తదాన శిబిరాల ఏర్పాటు గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందితో 2025 డిసెంబర్ 1 నుంచి 2026 నవంబర్ 30 వరకు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు.