News June 4, 2024

ప.గో.లో 9 మంది కూటమి అభ్యర్థులు WON

image

ప.గో. జిల్లాలో కూటమి దూసుకుపోతుంది. జిల్లాలోని 15 సీట్లను క్లీన్ స్వీప్ చేసే దిశగా వెళ్తోంది. ఉండి, పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు, చింతలపూడి, తణుకు, నరసాపురం, తాడేపల్లిగూడెంలలో విజయ కేతనం ఎగరేయగా.. తాజాగా ఆచంట నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి పితాని సత్యనారాయణ 84429 ఓట్లు సాధించి 26076 మెజారిటీ సాధించారు.

Similar News

News November 9, 2024

భీమవరం: ఉచిత ఇసుకపై కలెక్టర్ సమీక్ష

image

ఉచిత ఇసుకను వినియోగదారులకు మరింత చెరువ చేయుడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం అధికారులతో సమీక్ష సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..వినియోగదారుడు తక్కువ ధరకే ఇసుకను పొందేలా చర్యలు చేపట్టామన్నారు. ఇసుక రవాణాకు వాహనం అవసరమైన వారి కోసం ఫెసిలిటేషన్ సెంటర్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయాలన్నారు.

News November 9, 2024

కూటమి ప్రభుత్వంలో ప.గో జిల్లా నేతలకు కీలక పదవులు

image

సీఎం చంద్రబాబు విడుదల చేసిన నామినేటెడ్ పదవుల రెండో లిస్టులో ప.గో జిల్లా నేతలకు కీలక పదవులు వరించాయి. నర్సాపురానికి చెందిన మహమ్మద్ హరీఫ్‌కి అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ క్యాబినెట్ ర్యాంక్ ఛైర్మన్‌, భీమవరానికి చెందిన వి.సూర్యనారాయణ రాజు ఏపీ క్షత్రియ వెల్ఫేర్ & డెవలెప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. కొత్తపల్లి సుబ్బరాయుడికి ఏపీ కాపు వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఛాన్స్ ఇచ్చారు.

News November 9, 2024

ఉండిలో మహిళపై ఏడుగురు లైంగిక వేధింపులు

image

ఒక మహిళపై ఏడుగురు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఉండి మండలంలో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ తండ్రితో ఉంటోంది. పక్కింట్లో ఉండే యాకోబుతో పాటు మరో ఆరుగురు లైంగికంగా వేధిస్తున్నారని ఆమె శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై ఉండి ఎస్సై నసీరుల్లా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.