News September 7, 2024

ప.గో.: వరదలపై సీఎం చంద్రబాబు ఆరా

image

కొల్లేరులో వరద ఉద్ధృతి, ఉప్పుటేరు ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ముఖ్యమంత్రి కొల్లేరు, ఉప్పుటేరు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేసే అవకాశం ఉందని సమాచారం అందడంతో పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. ఉప్పుటేరులో ప్రవాహానికి అడ్డంకులను తొలగించే పనులు ముమ్మరం చేయించారు.

Similar News

News October 9, 2024

ఆచంట: బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి

image

ఆచంట వేమవరానికి చెందిన బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు వివాహిత షేక్ రజియా(33) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె స్థానికంగా బ్యూటీ పార్లర్ నిర్వహిస్తుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుంది. భర్త సిలార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆచంట ఎస్ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

News October 9, 2024

విజయవాడ -శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు

image

దసరా పండగ సందర్భంగా ఈ నెల 9, 10, 11, 12, 14, 15 తేదీల్లో విజయవాడ-శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం రోడ్డు- విజయవాడకు ఈ నెల 10, 11, 12, 13, 15, 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక రైళ్లు తిరుగుతాయన్నారు. ఏలూరు, గూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, విజయనగరం, చీపురుపల్లి, మీదుగా ఈ రైళ్లు ప్రయాణిస్తాయన్నారు.

News October 9, 2024

తాడేపల్లిగూడెం: జాతీయ స్థాయి యోగాసన పోటీలకు చంద్రశేఖర్ ఎంపిక

image

రాష్ట్ర స్థాయిలో కర్నూలులో జరిగిన సంప్రదాయ యోగాసన పోటీల్లో తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు బడుగు చంద్రశేఖర్ గోల్డ్ మెడల్ సాధించారు. ఈ విషయాన్ని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ స్థానం సాధించడం ద్వారా మైసూర్‌లో నవంబర్ నెలలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలు ఎంపికైనట్లు వివరించారు. ఆయనను దండగర్ర జడ్పీహెచ్ హెచ్ఎం సీహెచ్. చంద్రశేఖర్ అభినందించారు.