News March 19, 2025
ప.గో : వారికి పింఛను కట్

ప.గో జిల్లాలో ఫించనుదారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 20 లోగా జీవన ప్రమాణాల పత్రం సంబంధిత అధికారులకు అందించాలని, లేకుంటే మార్చి నెలకు సంబంధించిన పింఛను సొమ్మును నిలిపివేస్తామని తెలిపారు. జిల్లాలో మొత్తం 14, 739 మంది ఉండగా.. గత నెల చివరి వరకు 14, 335 మంది పత్రాలను అందించినట్లు తెలిపారు. మిగిలిన వారికి పింఛను ఆపేసే అవకాశముందన్నారు.
Similar News
News March 20, 2025
స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

వెనుకబడిన తరగతుల వర్గాల నుంచి స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. బీసీ-ఎ,బీ,డీ,ఈ, ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి స్వయం ఉపాధి పథకాలు, జనరిక్ ఫార్మసీలు, ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటుకు సబ్సిడీతో కూడిన రుణాలను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు *https://apobmms.apcfss.in* ద్వారా ఆన్లైన్లో మార్చి 22వ తేదీ లోపుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News March 20, 2025
రైతుల నుంచి ఫిర్యాదులు రాకూడదు: జేసీ

రీ సర్వే గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి అయిన గ్రామాలలోని రైతులకు 9(2) నోటీసులను అందచేయాలని జేసీ రాహుల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ డివిజన్ అధికారులతో మాట్లాడారు. 13 గ్రామాలలో రైతులకు 9(2) నోటీసులను అందజేయాలన్నారు. ఏ ఒక్క రైతుకు తన భూమికి సంబంధించి నోటీసులు అందలేదని ఫిర్యాదులు రాకూడదన్నారు.
News March 19, 2025
కొల్లేరు సరిహద్దులు గుర్తింపు.. వారందరిలో ఆందోళన

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొల్లేరు సరిహద్దులను గుర్తించే ప్రక్రియను అధికారులు ముమ్మరంగా చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో ఉంటున్న వారంతా ఆందోళనకు గురవుతున్నారు. ప్రజాప్రతినిధులను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తమ జీవనోపాధికి ఆటంకం లేకుండా చూడాలని వేడుకుంటున్నారు. ఈ సర్వే ఇంకా పూర్తి కావాల్సి ఉంది. సర్వే పూర్తయి నివేదిక పరిశీలించిన తర్వాత సుప్రీం ఏం చేయబోతుందన్నదనే దానిపై ఉత్కంఠ నెలకొంది.