News December 26, 2024
ప.గో విషాదం నింపిన విహార యాత్ర

విహార యాత్ర విషాదాన్ని నింపింది. ద్వారకాతిరుమల (M) ఎం.నాగులపల్లి వద్ద ప్రమాదంలో ఓవ్యక్తి మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. ఘంటశాలకు చెందిన భాను ప్రకాశ్, గౌతమ్, వెంకట సాయి, చల్లపల్లికి చెందిన భార్గవ్, తేజలు విజయవాడ నుంచి కారు అద్దెకు తీసుకుని మారేడుమిల్లి విహార యాత్రకు బయలు దేరారు. నాగులపల్లి వద్ద బుధవారం వేకువ జామున ముందు వెళుతున్న లారీని కారు ఢీకొట్టింది. కారులో ఉన్న గౌతమ్ మృతి చెందాడు.
Similar News
News November 26, 2025
భీమవరంలో మెప్మా జాబ్ మేళా ప్రారంభం

మెప్మా సంస్థ ఆధ్వర్యంలో, నిపుణ సహకారంతో భీమవరం మున్సిపల్ కౌన్సిల్ హాలులో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేళాలో 16 కంపెనీలు పాల్గొన్నాయని, ఇలాంటి అవకాశాలు నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడతాయని వారు అన్నారు.
News November 26, 2025
రైతు ఆర్థిక బలోపేతానికి ‘రైతన్నా.. మీకోసం’: కలెక్టర్

రైతును ఆర్థికంగా బలోపేతం చేసే చర్యల్లో భాగంగా నిర్వహిస్తున్న ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. బుధవారం పాలకోడేరు మండలం కుముదవల్లిలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఆమె రైతుల సమక్షంలో నిర్వహించారు. రైతు సత్యనారాయణ రాజు మండువా పెంకుటిల్లు అరుగుపైనే ఈ కార్యక్రమం జరిగింది.
News November 26, 2025
భీమవరం: ఎస్సీ, ఎస్టీ యువతకు సివిల్స్ ఉచిత శిక్షణ

రాష్ట్రంలోని 340 మంది నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు నవంబరు 26లోపు https://apstudycircle.apcfss.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబరు 10 నుంచి 4 నెలలపాటు శిక్షణ ఉంటుందని, మహిళా అభ్యర్థులకు 33 శాతం సీట్లు కేటాయించామని ఆయన వివరించారు.


