News May 26, 2024
ప.గో: వెంకన్న దర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు..!

మొగల్తూరు మండలం కాళీపట్నంలో లారీని ఆటో ఢీకొన్న ఘటనలో <<13312994>>మహిళ మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. SI వెంకటరమణ వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం శేరిదగ్గుమిల్లికి చెందిన బి.ప్రసాద్ భార్య విష్ణువర్ధిని మరో ఐదుగురు చిన్నారులతో వాడపల్లి వెంకన్న ఆలయానికి ఆటోలో బయలుదేరారు. విజయవాడ నుంచి సిమెంట్తో వస్తున్న లారీ పక్కన ఆగి ఉండగా.. వీరి ఆటో వెళ్లి ఢీకొంది. విష్ణువర్ధిని అక్కడికక్కడే మృతి చెందింది.
Similar News
News December 12, 2025
సామాజిక చైతన్యానికి బాలోత్సవాలు: కలెక్టర్

బాలోత్సవాలు విద్యార్థుల్లో సామాజిక చైతన్యానికి సామాజిక ప్రగతికి ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ నాగరాణి అన్నారు. భీమవరం ఎస్ఆర్ కెఆర్ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగే బాలోత్సవాలను ఆమె ప్రారంభించారు. విద్యార్థులకు చిన్నతనం నుంచి ఆటలు పాటలు ఉంటే చెడు మార్గం వైపు వెళ్లరని అన్నారు. ఎమ్మెల్సీ గోపీమూర్తి మాట్లాడుతూ..సమాజాన్ని పట్టిపీడిస్తున్న పలు రకాల వ్యసనాలతో విద్యార్థి యువత పెడదోవ పడుతున్నారని అన్నారు.
News December 12, 2025
దివ్యాంగుడి సమస్య విన్న కలెక్టర్

భీమవరం మండలం గూట్లపాడుకి చెందిన గౌరీ శంకరరావు కుటుంబ సభ్యులు శుక్రవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశానికి వచ్చారు. వీరిని చూసిన కలెక్టర్ చదలవాడ నాగరాణి దివ్యాంగుడు శంకర్ పరిస్థితిని చూసి సమస్యను అడిగి తెలుసుకున్నారు. పుట్టుకతోనే అంగవైకల్యం ఉండడంతో దివ్యాంగ ఫించన్ రూ. 6 వేల వస్తోందని, వందశాతం అంగవైకల్యం ఉన్న తనకు రూ.15 వేల పింఛన్ ఇవ్వాలని కోరాడు. ఈ అర్జీని కలెక్టర్ అధికారులకు సిఫార్సు చేశారు.
News December 12, 2025
నరసాపురం నుంచి వందేభారత్

నరసాపురం – చెన్నైకి వందేభారత్ నడిచేందుకు ఈ నెల 15 న ముహూర్తం ఖరారయింది. ప.గో నుంచి ఇదే తొలిసారి కావడంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ రైలు నరసాపురం – విజయవాడ మధ్య నరసాపురం, భీమవరం, గుడివాడలో ఆగుతుంది. కాగా ఇది నరసాపురంలో మ. 2.50కి బయలుదేరి రాత్రి 11.45కు చెన్నైకి చేరుతుంది. తిరిగి ఉ. 5.35కు బయలుదేరి మ.2.10కి నరసాపురంలో ఉంటుంది.


