News February 10, 2025

ప.గో: వేరు వేరు ఘటనల్లో నలుగురి ఆత్మహత్య

image

ఉమ్మడి ప.గో జిల్లాలో ఆదివారం వేరువేరు ఘటనల్లో నలుగురు సూసైడ్ చేసుకున్నారు. ద్వారకాతిరుమల తిమ్మాపురానికి చెందిన సోమశేఖర్ (42) కడుపునొప్పితో, పెదవేగిలోని రాట్నాలకుంటకు చెందిన మరియమ్మ కొడుకు కాలేజీ ఫీజుకోసం దాచిన సొమ్ముతో భర్త మద్యం తాగేశాడని సూసైడ్ చేసుకుంది. అలాగే అనారోగ్యంతో దొంగలమండపానికి చెందిన మాధవి విషం తాగింది. వారితో పాటు పాలకోడేరుకు చెందిన యడ్ల చంద్రశేఖర్ అనుమానాస్పద స్థితిలో కన్నుమూశాడు.

Similar News

News September 18, 2025

ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

image

EPFO <>వెబ్‌సైట్‌లో<<>> పాస్‌బుక్ కోసం ప్రత్యేకంగా లాగిన్ అయ్యే అవసరాన్ని సంస్థ తగ్గించింది. ఇకపై మెంబర్ పోర్టల్‌లోనే పీఎఫ్ లావాదేవీలను చెక్ చేసుకునేలా పాస్‌బుక్ లైట్ పేరిట కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల సింగిల్ లాగిన్‌తోనే అన్ని వివరాలు చెక్ చేసుకోవచ్చు. అటు ఉద్యోగి పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్‌ కూడా పోర్టల్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉండనుంది.

News September 18, 2025

అనకాపల్లి: గ్యాస్ సబ్సిడీ నగదు జమ కాని వారికి గమనిక

image

గ్యాస్ సబ్సిడీ నగదు బ్యాంకు ఖాతాలో జమకాని లబ్ధిదారులు నేరుగా బ్యాంకు వద్దకు వెళ్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ జాహ్నవి లబ్ధిదారులకు సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దీపం -2 పథకంలో భాగంగా సబ్సిడీపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 805 మంది లబ్ధిదారులకు నగదు జమకాలేదని వారికి డీలర్లు తగిన సమాచారం ఇవ్వాలన్నారు.

News September 18, 2025

ఏలూరు: రెవెన్యూ ఉద్యోగుల బదిలీలు

image

ఏలూరు జిల్లాలో ఏడుగురు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు సీనియర్ అసిస్టెంట్లకు బదిలీ ఉత్తర్వులను డీఆర్‌ఓ విశ్వేశ్వరయ్య జారీ చేశారు. కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాల మేరకు ఈ బదిలీలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మూడు నుంచి ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి ఈ బదిలీలు వర్తిస్తాయని పేర్కొన్నారు.