News July 31, 2024
ప.గో.: శాసనమండలి ఛైర్మన్ కుమారుడు IPSకి ఎంపిక

భీమవరం పట్టణానికి చెందిన శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు చిన్న కుమారుడు కొయ్యే చిట్టిరాజు ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్లో విడుదలైన సివిల్స్- 2023 ఫలితాల్లో ఆయన 833వ ర్యాంకు సాధించారు. ఆయనను ఐపీఎస్‌కు ఎంపిక చేసినట్లు ఉత్తర్వులు అందాయి. ఆగస్టు 26వ తేదీ నుంచి ముస్సోరిలో శిక్షణకు ఆయన హాజరుకానున్నారు. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో ఢిల్లీలో ఉంటూ పట్టుదలతో చదివారని చెప్పారు.
Similar News
News January 19, 2026
యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్, జిల్లాలోని అన్ని ప్రభుత్వ మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News January 18, 2026
బధిరుల క్రీడల్లో ‘పశ్చిమ’ ప్రభంజనం.. జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం

హర్యానాలో జరిగిన రాష్ట్రస్థాయి బధిరుల క్రీడా పోటీల్లో ప.గో. జిల్లా క్రీడాకారులు ప్రథమ స్థానం సాధించారని అసోసియేషన్ గౌరవాధ్యక్షులు చెరుకువాడ రంగసాయి తెలిపారు. తొమ్మిది రాష్ట్రాల నుంచి 600 మంది పాల్గొన్న ఈపోటీల్లో, జిల్లా నుంచి వెళ్లిన 16 మంది ప్రతిభ కనబరిచారన్నారు. విజేతలను ఆదివారం భీమవరంలో ఘనంగా అభినందించారు. శారీరక వైకల్యాన్ని అధిగమించి క్రీడల్లో రాణించడం అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.