News December 26, 2024
ప.గో: సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లేది ఎలా..?

సంక్రాంతికి స్వగ్రామాలకు వచ్చే వారికి టిక్కెట్ల ధరలు గుబులు పుట్టిస్తున్నాయి. రైలు, బస్సు ఛార్జీలు ధరలు చూసి షాక్ అవుతున్నారు. హైదరాబాదు నుంచి భీమవరం, తణుకు మీదుగా 17 రైళ్లు నడుస్తున్నాయి. వాటిలో ఒక్క టిక్కెట్ కూడా దొరకని పరిస్థితి. ఏలూరు, భీమవరం, తణుకు ప్రైవేట్ ఏసీ స్లీపర్ ఛార్జీ రూ.1,100 ఉండగా దాన్ని రూ.4 వేలకు పెంచారు. ప్రస్తుతం 50 బస్సులు ఉండగా, వాటిని 70కి పెంచినా డిమాండ్ తగ్గలేదంటున్నారు.
Similar News
News October 17, 2025
ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు వేగవంతం చేయాలి: జేసీ

ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై భీమవరం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ధాన్యం సేకరణ త్వరలో ప్రారంభం కానున్నందున, సంబంధిత అధికారులు ఏర్పాట్లు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలలో కూడా కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆర్డీవోలకు సూచించారు.
News October 17, 2025
రాష్ట్రస్థాయి పోటీలకు 42 మంది విద్యార్థులు ఎంపిక

ఉమ్మడి ప.గో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడల్లో తణుకు ఎస్కేఎస్డీ మహిళా జూనియర్ కళాశాలకు చెందిన 42 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. గత నెల 12 నుంచి ఈనెల 15 వరకు అండర్-19 విభాగంలో వీరంతా ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ భూపతిరాజు హిమబిందు తెలిపారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో కళాశాల కరస్పాండెంట్ చిట్టూరి సత్యఉషారాణి అభినందించారు.
News October 17, 2025
‘కార్తీక మాసంలో పర్యాటకులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి’

కార్తీక మాసంలో పేరుపాలెం బీచ్కు వచ్చే పర్యాటకులకు ఆయా శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని నర్సాపురం ఆర్డీవో దాసిరాజు అధికారులకు సూచించారు. గురువారం కేపీపాలెం బీచ్ వద్ద కార్తీక మాస ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి బీచ్లో యాత్రికులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ, డీఎల్పీఓ, ఎమ్మార్వో తదితర అధికారులు పాల్గొన్నారు.