News December 26, 2024

ప.గో: సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లేది ఎలా..?

image

సంక్రాంతికి స్వగ్రామాలకు వచ్చే వారికి టిక్కెట్ల ధరలు గుబులు పుట్టిస్తున్నాయి. రైలు, బస్సు ఛార్జీలు ధరలు చూసి షాక్ అవుతున్నారు. హైదరాబాదు నుంచి భీమవరం, తణుకు మీదుగా 17 రైళ్లు నడుస్తున్నాయి. వాటిలో ఒక్క టిక్కెట్ కూడా దొరకని పరిస్థితి. ఏలూరు, భీమవరం, తణుకు ప్రైవేట్ ఏసీ స్లీపర్ ఛార్జీ రూ.1,100 ఉండగా దాన్ని రూ.4 వేలకు పెంచారు. ప్రస్తుతం 50 బస్సులు ఉండగా, వాటిని 70కి పెంచినా డిమాండ్ తగ్గలేదంటున్నారు.

Similar News

News January 18, 2025

ఏలూరు: చనిపోయిన కోడికి వేలం..రూ. లక్ష

image

సంక్రాంతి కోడిపందేల బరిలో మృతి చెందిన ఓ కోడికి యజమానులు వేలంపాట నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే జాలిపూడికి చెందిన నవీన్ చంద్రబోస్ వేలంపాటలో పాల్గొన్నారు. రూ.1,11,111 వెచ్చించి కోడిని దక్కించుకున్నారు. ఈ వేలం పాటకు అధిక సంఖ్యలో జనం పోటీ పడగా చంద్రబోస్ గెలుపొందారు.

News January 18, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’ బుల్లి రాజుది మన ఏలూరే

image

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని బుల్లి రాజు క్యారెక్టర్‌తో అందరినీ అలరించిన రేవంత్ ఏలూరు జిల్లా నిడమర్రు మండలం చానమిల్లి గ్రామానికి చెందిన రొయ్యల వ్యాపారి భీమాల శ్రీనివాస రావు కుమారుడు. రేవంత్ ‘సంక్రాంతికి వస్తున్నాం’లో వెంకటేశ్‌కి కొడుకుగా నటించే ఛాన్స్ కొట్టేశాడు. 11 సంవత్సరాల వయసులో సినిమా ఇండస్ట్రీకి కొత్తైనా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు.

News January 18, 2025

నరసాపురం టూ చర్లపల్లికి ఖాళీగా వెళ్లిన రైలు

image

సంక్రాంతి ప్రయాణీకులతో రద్దీగా ఉంటుందని శుక్రవారం నరసాపురం- చర్లపల్లికి ఏర్పాటు చేసిన రైలు కాళీగా దర్శనమిచ్చింది.దీంతో ఈనెల 19 నరసాపురం నుంచి చర్లపల్లికి మరో రైలు నడుపుతున్నట్లు స్టేషన్ మేనేజర్ మధుబాబు చెప్పారు. ఈ రైలు నరసాపురంలో రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు చర్లపల్లికి వెళ్తుందన్నారు. పాలకొల్లు, భీమవరం టౌన్, జంక్షన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, ఖమ్మం, వరంగల్ మీదుగా వెళ్తుంది.